Acharya Movie: ఏపీలో థియేటర్స్ పై టికెట్ రేట్లు పై త్వరలో ఓ క్లారిటీ కానుంది. దాంతో స్టార్ హీరోలందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడానికి కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ పై ఓ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.

జనవరికి ఎలాగూ పెద్ద సినిమాలతో పాటు ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. కాబట్టి.. డిసెంబర్ కి తమ సినిమాను రిలీజ్ చేసుకోవడం బెటర్ అని మెగాస్టార్ టీమ్ భావిస్తోంది. అందుకే ప్రస్తుతం రిలీజ్ డేట్స్ ను పరిశీలిస్తోంది. పక్కాగా లెక్కలు వేసుకున్నాకే ముఖ్యంగా ఏ సినిమా పోటీ లేని సమయంలోనే విడుదల తేదీని ప్రకటించాలని మెగా టీమ్ ప్లాన్.
ఇక తాజా అప్ డేట్ ప్రకారం మరో మూడు రోజుల్లో ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తారట. ఆచార్య సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కొన్ని సీన్స్ కి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. మరో ఆరు రోజుల వర్క్ తో ఈ సినిమాకి ప్యాకప్ చెబుతారు. కానీ డిసెంబర్ లో ఏ వీక్ లో రిలీజ్ చేస్తారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. డిసెంబర్ లో కూడా ఆల్రెడీ మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
అందులో బాలకృష్ణ ‘అఖండ’ సినిమా కూడా ఉందని అంటున్నారు. మరోపక్క క్రిస్మస్ కి అల్లు అర్జున్ “పుష్ప” కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ “కేజీఎఫ్ 2” పోటీకి సై అంటుంది. మరి ఈ లెక్కన “ఆచార్య”కి డిసెంబర్ లో కూడా సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టమే. మరి చూడాలి రిలీజ్ ఎలా ప్లాన్ చేస్తారో.
ఇక ఆచార్య సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయట. ముఖ్యంగా చిరు – చరణ్ కాంబినేషన్ అదిరిపోతోందట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.