
Akhanda Movie: నటసింహం బాలయ్య చేత మళ్ళీ ఘనంగా గర్జించేలా బోయపాటి శ్రీను అఖండతో భారీగా ప్లాన్ చేశాడు. నిజానికి ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో మొదట్లో చాలా నెగిటివ్ టాక్ ను బయటకు వదిలారు. ఆ తర్వాత బాలయ్య యాంటీ ఫ్యాన్స్ ఆ టాక్ ను బాగా ప్రచారం చేశారు. దాంతో ఇండస్ట్రీలో కూడా సినిమా బాగా రాలేదట.. అంటూ తమ సినిమాలను బాలయ్య సినిమా పై పోటీగా వదలడానికి సన్నద్ధం అయ్యారు.
ఈ క్రమంలోనే రవితేజ ఖిలాడీ సినిమాను రెండుసార్లు బాలయ్యకు పోటీగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ లోపు మళ్ళీ కరోనా రావడం.. అన్నీ సినిమాలు రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవడంతో అంతా మొదటికి వచ్చింది. అయితే, ఈ గ్యాప్ లో కొంతమంది బయ్యర్లకు బాలయ్య సినిమాను చూపించారు, అప్పటికే నెగిటివ్ టాక్ బాగా ఉండటంతో.. బయ్యర్లు కూడా మొహమాట పడుతూ సినిమా చూశారు.
సినిమా పూర్తి అయిన వెంటనే నేరుగా సినిమా నిర్మాత దగ్గరకు పోయి.. మాకు దయచేసి.. సినిమాని ఇచ్చేయండి అంటూ రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికి గాని మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్లకు అఖండ(Akhanda Movie) అవుట్ ఫుట్ అర్ధం కాలేదు. ఒక్కసారిగా అఖండకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. థియేటర్స్ రైట్స్ కోసం పోటీ ఎక్కువ అయింది.
దాంతో ఇండస్ట్రీ పర్సన్స్ కు మ్యాటర్ అర్ధం అయింది. ఓ విధంగా అందరూ షాక్ అయ్యారనే అనుకోవాలి. ఎందుకంటే బాలయ్య సినిమాకు ఈ లెవెల్ రెస్పాన్స్ అన్నది ఇప్పటి వరకు లేదు. భవిష్యత్ లో వుంటుందని గ్యారంటీ కూడా లేదు కాబట్టి.. ఈ సినిమాను మిస్ చేసుకోకూడదు అని బయ్యర్లు కాస్త అదనపు రేట్లు ఇచ్చి మరీ సినిమా థియేటర్ రైట్స్ ను ఏరియాల వారీగా సొంతం చేసుకుంటున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో ఎలాంటి మ్యాజిక్ జరగలేదు. పైగా ఆ సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే అఖండ సినిమా విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. అఖండ సినిమాకు భారీ హైప్ వచ్చింది. అందుకే, బాలయ్య ఫ్యాన్సు కు అఖండ పూనకాలు రప్పిస్తోంది.
Also Read: బాలయ్య ఓటీటీ షోలో దీపావళి పండగ సందడి!