https://oktelugu.com/

Akhanda: అర్థ శతదినోత్సవ వేడుకల్లో అఖండ !

Akhanda:  నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. స్థానిక ఖమ్మం జిల్లా ఆదిత్య థియేటర్ లో అఖండ అర్థ శతదినోత్సవ వేడుకలు గురువారం రోజున సాయంత్రం ఖమ్మం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాసరావు గారు నందమూరి యువసేన అధ్యక్షుడు నల్లమల రంజిత్ గారి ఆధ్వర్యంలో 50 రోజుల సందర్భంగా 50 కేజీల కేక్ ను […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 21, 2022 / 09:11 AM IST

    Akhanda collection

    Follow us on

    Akhanda:  నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. స్థానిక ఖమ్మం జిల్లా ఆదిత్య థియేటర్ లో అఖండ అర్థ శతదినోత్సవ వేడుకలు గురువారం రోజున సాయంత్రం ఖమ్మం జిల్లాలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాసరావు గారు నందమూరి యువసేన అధ్యక్షుడు నల్లమల రంజిత్ గారి ఆధ్వర్యంలో 50 రోజుల సందర్భంగా 50 కేజీల కేక్ ను కట్ చేయడం జరిగింది.

    Akhanda

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ దర్శకులు దేవినేని ఫేమ్ శివనాగు గారు మరియు ఖమ్మం జిల్లా ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారు కేకును కట్ చేయడం జరిగింది. అలాగే నూతన సంవత్సర సందర్భంగా నందమూరి బాలకృష్ణ యువసేన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ గారు మరియు సినీ దర్శకులు మాట్లాడుతూ అఖండ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.

    Also Read:  కరోనా థర్డ్ వేవ్ గురించి ఆందోళన అవసరం లేదు !

    ఇలాంటి సినిమాలు బాలకృష్ణ గారికిఎన్నో విజయాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు అభిమానులకు మునుముందు మరెన్నో మంచి సినిమాలు తీయాలని వారు డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ గారు కోరారు . హ్యాండీ క్యాప్ రాము కి ఈ సందర్భంగా ఆర్ధిక సహాయం చేయడం జరిగింది….ఈ కార్యక్రమంలో మధు తారక్ బాలాజీ, చంద్రశేఖర్, సతీష్, నాగు తదితరులు పాలుగోన్నారు. మొత్తానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన నటసింహం బాలయ్య తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా చాటుకున్నాడు.

    Also Read: ఆదాయపు పన్నును సులువుగా ఆదా చేయడానికి పాటించాల్సిన పది చిట్కాలివే!

    Tags