https://oktelugu.com/

Pragya Jaiswal: బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అరాచకం… బికినీలో తెగించిన బోల్డ్ బ్యూటీ!

పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రగ్యా నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.

Written By:
  • Shiva
  • , Updated On : October 6, 2023 / 11:32 AM IST

    Pragya Jaiswal

    Follow us on

    Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ కి కాలం కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నా రేసులో వెనుకబడిపోయింది. పరిశ్రమలో ఒకరి ఫేట్ నిర్ణయించేది సక్సెస్ మాత్రమే. అది లేక ప్రగ్యా తెరమరుగు అవుతుంది. ఒకటి రెండు హిట్స్ పడ్డా ప్రగ్యాను స్టార్ చేయలేకపోయాయి. చిన్న చిన్న చిత్రాలు చేసుకుంటున్న ప్రగ్యాకు దర్శకుడు క్రిష్ గోల్డెన్ ఆఫర్ ఇచ్చాడు. కంచె సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా ప్రగ్యాను తీసుకున్నాడు.

    పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రగ్యా నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. మంచు మనోజ్ తో చేసిన గుంటూరోడు ప్లాప్. సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రంలో ప్రగ్యా నటించారు. ఇది అల్ట్రా డిజాస్టర్ అయ్యింది. దాంతో ప్రగ్యా సెకండ్ హీరో రేంజ్ కి పడిపోయింది.

    జయ జానకీ నాయక చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. ఆ సినిమా యావరేజ్ రిజల్ట్ అందుకుంది. అయితే అఖండ రూపంలో ప్రగ్యాకు బ్లాక్ బస్టర్ పడింది. బాలయ్య ఫార్మ్ లో లేకపోవడంతో ప్రగ్యాకు ఛాన్స్ వచ్చింది. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ భారీ విజయం సాధించింది. మెయిన్ హీరోయిన్ గా కథలో కీలకమైన పాత్ర ఆమెకు దక్కింది.

    అఖండ విజయంతో ప్రగ్యా ఫేట్ మారుతుందనుకుంటే అలా జరగలేదు. అఖండ హిట్ క్రెడిట్ అంతా బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో ఆమెకు ఆఫర్స్ రాలేదు. చేతిలో అవకాశాలు లేకపోవడంతో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రగ్యా ఖాతాలో అధికారికంగా ఒక్క సినిమా లేదు.

    ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం అల్లాడిస్తుంది. ఆమె తాజా ఫోటో షూట్ హద్దులు దాటేసింది. బికినీలో దారుణమైన స్కిన్ షోకి తెరలేపింది. అమ్మడు తీరు చూస్తుంటే అవకాశాల కోసం తెగిస్తున్న భావన కలుగుతుంది. ప్రగ్యా హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.