https://oktelugu.com/

Akhanda: అఖండ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య !

Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడిచింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు. వాస్తవానికి అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 22, 2022 / 12:45 PM IST
    Follow us on

    Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడిచింది. నటసింహం తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు.

    Akhanda collection

    వాస్తవానికి అసలు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని.. ఈ సినిమా నిర్మాత కూడా ఊహించలేదు. కారణం, బాలయ్య గత చిత్రాలు జైసింహా, రూలర్, ఎన్టీఆర్ బయోపిక్ ఇలా వరుసగా అన్నీ సినిమాలలో ఏది పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అందుకే దిల్ రాజుకి ఈ సినిమా నైజాం రైట్స్ ను చాలా తక్కువ ధరకే అమ్మారు. మొత్తానికి దిల్ రాజుకు ఫుల్ లాభాలు వచ్చాయి.

    Also Read: పునీత్ రాజ్ కుమార్’కు నివాళి గా 5 సినిమాలు ఫ్రీ – అమెజాన్ ప్రైమ్

    ఈ బ్లాక్ బస్టర్ చిత్రం 50 రోజుల పాటు దిగ్విజయంగా థియేటర్స్ లో ఆడింది. ఇక క్లోజింగ్ కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :

    గుంటూరు 4.89 కోట్లు
    కృష్ణా 3.67 కోట్లు
    నెల్లూరు 2.67 కోట్లు
    నైజాం 20.84 కోట్లు
    సీడెడ్ 15.91 కోట్లు
    ఉత్తరాంధ్ర 6.34 కోట్లు
    ఈస్ట్ 4.29 కోట్లు
    వెస్ట్ 4.03 కోట్లు

    Akhanda

    ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 62.64 కోట్లు

    రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 10.65 కోట్లు

    ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 73.29 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

    ‘అఖండ’ సినిమాకు రూ.53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొత్తమ్మీద ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ కి వస్తే.. రూ. 73.29 కోట్ల షేర్ ను ఈ చిత్రం రాబట్టింది. ఓవరాల్ గా చూసుకుంటే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి రూ. 19.29 కోట్ల లాభాలు దక్కాయి. పైగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ రూపంలో అదనపు లాభాలు వచ్చాయి. అన్నీ కలుపుకుని లెక్క వేసుకుంటే.. 110 కోట్లు వరకు ఈ సినిమాకు గిట్టుబాటు అయినట్టే.

    Also Read: హైదరాబాద్‌కు వ‌స్తున్న మరో టాప్ కంపెనీ.. రూ.20 వేల కోట్ల పెట్టుబ‌డులు!

    Tags