https://oktelugu.com/

Akhanda: వినుకొండలో ఘనంగా ‘అఖండ’ వేడుకలు !

Akhanda: నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. కాగా అత్యంత విజయవంతంగా వినుకొండ సురేష్ మహల్ థియేటర్ లో 50వ రోజు లోకి అడుగుపెట్టింది ‘అఖండ’ సినిమా. రాష్ట్ర వ్యాప్తంగా అఖండ సినిమాని 103 థియేటర్ లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శిస్తుండగా అందులో వినుకొండ సురేష్ మహల్ కూడా ఉండటం గమనార్హం. అయితే, ఈ రోజు అఖండ 50 రోజుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 20, 2022 / 02:23 PM IST
    Follow us on

    Akhanda: నటసింహం బాలయ్య తన ‘అఖండ’తో భారీ అంచనాల మధ్య వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. కాగా అత్యంత విజయవంతంగా వినుకొండ సురేష్ మహల్ థియేటర్ లో 50వ రోజు లోకి అడుగుపెట్టింది ‘అఖండ’ సినిమా. రాష్ట్ర వ్యాప్తంగా అఖండ సినిమాని 103 థియేటర్ లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శిస్తుండగా అందులో వినుకొండ సురేష్ మహల్ కూడా ఉండటం గమనార్హం.

    Akhanda:

    అయితే, ఈ రోజు అఖండ 50 రోజుల వేడుకలను వినుకొండ సురేష్ మహాల్ థియేటర్ చాలా ఘనంగా జరిపింది. ఈ వేడుకలో సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే బాలయ్య అభిమానులు కేక్ కట్ చేసి ఘనంగా 50 రోజుల వేడుకలను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు బోడెపూడి శంకర్, నలబోలు శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు జానీ, వంకాయలపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    Also Read: వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?

    మొత్తమ్మీద ఈ అఖండ సినిమా రిలీజ్ అయిన 50 రోజులు అవుతున్నా ఇంకా బాగానే కలెక్ట్ చేసింది. మొత్తమ్మీద కలెక్షన్స్ విషయంలో అఖండ ఏ మాత్రం తగ్గ లేదు. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది. మొత్తానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చిన నటసింహం బాలయ్య తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా చాటుకున్నాడు.

    Also Read: లైకా’తో బన్నీ పాన్ ఇండియా సినిమా !

    Tags