https://oktelugu.com/

AP Employees: ఫిట్‌మెంట్ పంచాయితీ.. సమ్మెకు సై అంటున్న ఉద్యోగులు..?

AP Employees: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో కొత్త పంచాయితీ మొదలైంది. పీఆర్సీతో తాము నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కంటే తెలంగాణ ఉద్యోగులు పరిస్థితి బెటర్ గా ఉందని మాట్లాడుతున్నారు. ఫిట్‌మెంట్ ఇచ్చిందే తక్కువ అంటే హెచ్‌ఆర్‌ఏ తగ్గించడం ఎంతమేర సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే విధానాలను ఏపీ ఉద్యోగులకు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. తమ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 20, 2022 / 02:38 PM IST
    Follow us on

    AP Employees: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో కొత్త పంచాయితీ మొదలైంది. పీఆర్సీతో తాము నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కంటే తెలంగాణ ఉద్యోగులు పరిస్థితి బెటర్ గా ఉందని మాట్లాడుతున్నారు. ఫిట్‌మెంట్ ఇచ్చిందే తక్కువ అంటే హెచ్‌ఆర్‌ఏ తగ్గించడం ఎంతమేర సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే విధానాలను ఏపీ ఉద్యోగులకు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది.

    AP Employees

    తమ సమస్యను జగన్ ప్రభుత్వం ఏ మాత్రం సానుకూలంగా చూడకపోగా ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా సీఎస్ ప్రెస్‌మీట్ పెట్టి వ్యాఖ్యలు చేయడం ఉద్యోగ సంఘాలు రుచించలేదు. దీంతో పోరుబాటకు దిగాలని నిర్ణయించుకున్నాయి. గురువారం అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై సమ్మె విషయంపై నిర్ణయం తీసుకుంటాయని.. శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ఆదాయం పడిపోయిందని ప్రభుత్వం అదే పనిగా చెబుతున్నా మాటలను ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. అదంతా అవాస్తవం అని కొట్టిపారేస్తున్నారు.

    AP Employees

    Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?

    ప్రభుత్వ ఆదాయం పెరుగుతోందని కాగ్ లెక్కలు చెబుతున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ చేతకాకే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఈ పీఆర్సీని ఓకే చేస్తే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ప్రకటించారు. అందుకే సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఉద్యోగుల నిర్ణయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని సమాచారం. వాళ్లు సమ్మెకు దిగితే ప్లాన్ బీ రెడీ చేసుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా సమ్మెకు దిగితే వాలంటీర్లు రెడీగా ఉన్నారు. అవసరమైతే తాత్కాలిక నియామకాలు జరుపుకుని ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.

    Also Read: తెలంగాణ బెటర్ అంటున్న ఏపీ ఉద్యోగులు.. ఎందుకో తెలుసా!

    Tags