Akhanda 2 Collection: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులను ఎదురుకున్న ఈ చిత్రానికి, విడుదల తర్వాత ఆడియన్స్ ని కచ్చితంగా అలరిస్తుందని అనుకుంటే, బోయపాటి శ్రీను తన మార్క్ పైత్యం తో థియేటర్స్ లోని ప్రేక్షకులకు మెంటలెక్కిపోయేలా చేసాడు. అయితే ఇండస్ట్రీ ని మూడు సార్లు షేక్ చేసిన కాంబినేషన్ కాబట్టి ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చాయి. రెండవ రోజు వసూళ్లు కూడా మరీ దారుణంగా కాకుండా, డీసెంట్ స్థాయిలోనే వచ్చాయి. కానీ ఈ ట్రెండ్ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. అయితే రెండు రోజులు ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం.
ముందుగా రెండవ రోజు ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, నరిజామ్ ప్రాంతం నుండి 3 కోట్ల 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, సీడెడ్ ప్రాంతం నుండి కోటి 65 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 87 లక్షలు, తూర్పు గోదావరి నుండి 55 లక్షలు, పశ్చిమ గోదావరి నుండు 38 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 57 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 55 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 33 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల 67 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా రిటర్న్ జీఎస్టీ కలుపుకొని మాత్రమే అట. వర్త్ థియేట్రికల్ షేర్ ఇంకా తక్కువ ఉంటుందని అంటున్నారు.
ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, రెండవ రోజు 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు విడుదలకు ముందు వరల్డ్ వైడ్ గా 104 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. రేపటి నుండి ఈ చిత్రానికి థియేట్రికల్ రన్ రావడం చాలా కష్టం. కాబట్టి ఈ సినిమాకు కనీసం 50 రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.