Ustaad Bhagat Singh Song: ఓజీ(They Call Him OG) వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే ఏడాది మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది. మేకర్స్ ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు, కానీ ‘పెద్ది’ చిత్రం వాయిదా పడితే మార్చ్ 19 లేదా మార్చ్ 27న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మేకర్స్ ఇప్పటి నుండే ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘దేఖ్లేంగే సాలా’ ని విడుదల చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కంటే, ఈ పాటలో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు చూసి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది.
‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ జోష్, ఎనర్జీ తో ఈ పాటలో డ్యాన్స్ వేసినట్టుగా అనిపించింది. కొన్ని స్టెప్పులు అయితే అభిమానులు కూడా ఊహించి ఉండరు, ఆ రేంజ్ లో వేసాడు. ఆయన ఎలాంటి డ్యాన్స్ వేయకుండా, కేవలం పాట మొత్తం నడిస్తేనే పులకరించిపోయే అభిమానులు, ఈ రేంజ్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తే రికార్డ్స్ పెట్టకుండా ఉంటారా?, అందుకే ఈ పాటకు సౌత్ ఇండియా లోనే ఆల్ టైం రికార్డు వ్యూస్ ని అందించారు ఫ్యాన్స్. ప్రస్తుతానికి ఈ పాటకు 19 గంటల్లో 28 మిలియన్స్ కి పైగా వ్యూస్, 4 లక్షణాలు 70 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 24 గంటలు ముగిసేలోపు ఈ పాటకు 32 మిలియన్ కి పైగా వ్యూస్, 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఇంతకు ముందు ఆల్ టైం రికార్డు ‘పెద్ది’ చిత్రం లోని ‘చికిరి చికిరి’ పాటకు ఉండేది. ఈ పాటకు 24 గంటల్లో 29 మిలియన్ కి పైగా వ్యూస్, 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డు ని ‘దేఖ్లేంగే సాలా’ పాట అవలీల గా దాటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాబోయే రోజుల్లో ఈ పాట కూడా చికిరి చికిరి పాట లాగా వంద మిలియన్ వ్యూస్ ని అందుకుంటుందా లేదా అనేది చూడాలి. ఒక సినిమాపై అంచనాలు పెరగడానికి ఆ చిత్రం లోని సూపర్ హిట్ పాటలే ఉపయోగపడుతాయి. ఈ చిత్రానికి కూడా ఈ పాట అలా ఉపయోగపడింది. మొదటి బంతికే పవర్ స్టార్ సిక్సెర్ కొట్టేసాడు. ఇక రాబోయే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతాయి.