Akhanda 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి అయితే క్రియేట్ అయింది. మరి ఇకమీదట సైతం సీనియర్ హీరోలు అందరూ తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది… మరి వాళ్ళు అనుకున్నట్టుగానే యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఇక ఇప్పుడు వాళ్ళు పాన్ ఇండియాలో కూడా సత్తా చాటుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
Also Read : అఖండ 2 లో యాక్షన్ డోస్ పెంచుతున్న బోయపాటి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇలాంటి సమయంలోనే ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాయి. తద్వారా ఆయనకంటూ ఎలాంటి క్రేజ్ క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2 (Akhanda 2) సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. మరి ఈ సినిమాకి ముందే ఆయన వరుసగా నాలుగు విజయాలను అందుకొని ఉండటం విశేషం…ఇక ఈ సినిమాతో ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటానని చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇకమీదట వచ్చే సినిమాలతో కూడా మంచి విజయాలను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు విలన్లుగా నటిస్తున్నారు.
అందులో ఒకరు ఆది పినిశెట్టి (Adi Pinishetty) కాగా, మరొకరు సుధీర్ బాబు (Sudheer Babu) గా తెలుస్తోంది. ఇప్పటివరకు సుధీర్ బాబు హీరో గానే సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ మొదటిసారి బాలయ్య బాబును ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా యూనిట్ నుంచి సుధీర్ బాబు విషయంలో ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచి సినిమా రిలీజ్ కి ముందు రివిల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆది పినిశెట్టి ఇప్పటికే బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన సరైనోడు సినిమాలో విలన్ గా నటించి స్టైలిష్ విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… ఇక బాలయ్య కనుక వరుస హిట్లర్ తో ముందుకు దూసుకెళ్తే సీనియర్ హీరోలు అందరికంటే కూడా ఆయన ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
Also Read : అయోమయంలో పడ్డ ‘అఖండ 2’ నిర్మాతలు..వెనకడుగు వేయక తప్పదా?