Akhanda 2 Thandavam Release Postponed: బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా రిలీజ్ వాయిదా వేశారు…ఈరోజు రిలీజ్ చేయాల్సిన సినిమాని హఠాత్తుగా ఆపివేయడం పట్ల బాలయ్య అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అఖండ 2 సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి సైతం అమౌంట్ ను ఇంకా పే చేయలేదట. అలాగే ఇతర ప్రొడక్షన్ హౌస్ లకు కూడా డబ్బులను చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక ఇలాంటి పాత బకాయిలను పెట్టుకొని వాళ్ళు సినిమా రిలీజ్ చేయడం ఎలా సాధ్యమవుతోంది. అందుకే వీలైనంత తొందర గా వీటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాయిదా వేసిన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే క్లారిటీ రావడం లేదు.
నిజానికి పెద్ద హీరో సినిమాకి ఇలాంటి లావాదేవీల వ్యవహారాలు ముందే చూసుకోవాలి. అలా కాకుండా తీరా రిలీజ్ సమయానికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులను పెట్టుకొని రిలీజ్ పోస్ట్ పోన్ చేయడం సరైంది కాదు. దానివల్ల సినిమాకి భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఒకసారి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందంటే ఇక ఆ సినిమాని చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దానివల్ల సినిమా మీద హైప్ తగ్గే అవకాశాలున్నాయి.
తద్వారా కలెక్షన్స్ విషయంలో కూడా ఇవి కీలకపాత్రను వహించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పలుమార్లు పోస్ట్ పోన్ అవ్వడంతో సినిమా మీద హైప్ తగ్గిపోయింది. అందువల్ల సినిమాకి చాలా వరకు తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేయడం వల్ల కూడా ఈ సినిమా భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదమైతే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
మధ్యలో బాలయ్యకు ఏంటి బాధ?
బాలయ్య 50 సంవత్సరాల సినీ కెరియర్ లో ఇప్పటి వరకు ఆయన సినిమా ఇలా రిలీజ్ దాకా వచ్చి ఆగిపోయిన రోజులు లేవు…కానీ ‘అఖండ 2’ వల్ల ఆయన ఒక చేదు అనుభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది…దీంతో ఇటు బాలయ్య సైతం తన ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి…
ఇక ఇప్పటికైనా నిర్మాతలు వీలైనంత తొందరగా మొండి బకాయిలను, టెక్నీషియన్స్ కి చెల్లించాల్సిన అమౌంట్ ని చెల్లిస్తే అఖండ 2 సినిమా రిలీజ్ కి నోచుకుంటుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా రిలీజ్ మరింత లేటవ్వచ్చు…