Akhanda 2 Thaandavam Teaser Review : నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ ని అభిమానులు కూడా ఊహించని విధంగా తీర్చి దిద్దింది ఈ చిత్రం. ఈ సినిమాతో మొదలైన బాలయ్య జైత్ర యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాంటి సంచలనాలకు కారణమైన ‘అఖండ'(Akhanda 2 Movie) కి సీక్వెల్ గత కొంతకాలం నుండి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రేపు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య నోటి నుండి వచ్చిన డైలాగ్ కూడా బాగా పేలింది. కానీ గ్రాఫిక్స్ విషయం లో మాత్రం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా బాలయ్య త్రిసూలం మేడలో వేసుకొని తిప్పుతూ విలన్స్ ని నరికే షాట్ లో గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. అభిమానులు సాధారణంగా ఎడిట్ చేసే వీడియోస్ ఇంతకంటే బాగుంటాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘నా శివుడి అనుమతి లేనిదే యముడు అయినా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా?’ అంటూ బాలయ్య పలికిన డైలాగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిమాలయ పర్వతాల్లో ఫైటింగ్ సన్నివేశం అంటే బాలయ్య పాకిస్తాన్ టెర్రరిస్ట్స్ తో ఫైటింగ్ చేస్తున్నట్టు అనిపించింది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నా ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఈ కోణాన్ని వాడుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఎందుకంటే ఈ చిత్రం ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది కాబట్టి. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇలాంటి అంశాలకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసమే ఈ బ్యాక్ డ్రాప్ పెట్టినట్టుగా అనిపించింది.
ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. సరైనోడు చిత్రం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం లో రెండవసారి నటిస్తున్న చిత్రమిది. ఇక హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తుంది. అదే విధంగా మొదటి భాగం లో ఉన్న నటీనటులు కూడా రెండవ భాగం లో ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి భాగం లో మొదటి మొదటి రోల్ కి జంటగా ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె పాత్ర ఈ సినిమాలో కూడా కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 25 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. అదే రోజున ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావు, కచ్చితంగా ఎదో ఒక సినిమా వాయిదా పడుతుంది. అది ఏ సినిమా అనేది త్వరలోనే తెలియనుంది.