Akhanda 2 Teaser Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు (Balayya Babu) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొస్తున్నాయి. రీసెంట్ గా ఆయన చేసిన నాలుగు సినిమాలు భారీ విజయాలను సాధించడంతో ఇకమీదట రాబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘అఖండ 2’ (Akhanda 2) నుంచి ఒక టీజర్ అయితే వచ్చింది. బోయపాటి – బాలయ్య కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమా విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ టీజర్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో అఘోరగా కనిపించే బాలయ్య బాబు ఏదో ఒక తప్పు చేసి హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు.
ఊర్లో ఉన్న రౌడీలు అతను మరోసారి ఊర్లోకి వచ్చే విధంగా జనాలను పట్టిపీడిస్తుండటం చేస్తారు. దాంతో ఆయన మరోసారి ఊర్లోకి వచ్చి శత్రువులను, దేశానికి చెడు చేసే వాళ్లందరినీ చంపి హిమాలయాలకు వెళ్లిపోతాడట… మొత్తానికైతే ఈ టీజర్ ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సినిమా కథ మొత్తం అర్థమైపోతుంది.
ఇక దీనికి సీక్వెల్ గా అఖండ 3 (Akhanda 3) సినిమా కూడా రాబోతుంది. అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే బాలయ్య బాబు ఇందులో తన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. టీజర్ లో చెప్పిన డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్ మొత్తం సినిమాకి హైలైట్ నిలువబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఆయన డైలాగ్స్ కి ఫైట్స్ కి థియేటర్లు మొత్తం దద్దరిల్లడమే కాకుండా బాలయ్య బాబు అభిమానులు కాలరేగిరేసుకొని మరి ఈ సినిమాను చూసి ఆనందించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది… మొత్తానికైతే బాలయ్య బాబు ఖాతాలో మరో సక్సెస్ రాబోతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా బాలయ్య బాబు దాటికి తట్టుకోవడం చాలా కష్టమే అంటూ విమర్శకుల నుంచి కొన్ని ప్రశంసలైతే దక్కుతున్నాయి…
