Site icon OkTelugu

Rakul Preet Singh insulted on stage: రకుల్ ప్రీత్ సింగ్ ని స్టేజి మీద దారుణంగా అవమానించిన షారుఖ్ ఖాన్ కొడుకు.. వీడియో వైరల్!

Rakul Preet Singh insulted on stage

Rakul Preet Singh insulted on stage

Rakul Preet Singh insulted on stage: బాలీవుడ్ లో నేపోటిజం పై గత నాలుగేళ్ల నుండి పెద్ద యుద్ధమే నడుస్తోంది. సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి వచ్చిన వారసులు కొంతమంది , ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా వచ్చిన వాళ్ళను చాలా తక్కువగా చూడడం , అవమానించడం వంటివి చేస్తున్నారని , ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా సెలబ్రిటీల వారసులకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఎదిగిన వారిపై ఎంతటి చిన్న చూపు ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ గురించి మీరంతా వైన్ ఉంటారు. ఇతను డ్రగ్స్ కేసు లో అరెస్ట్ అయ్యాడు , రీసెంట్ గా ఒక పార్టీ లో వెక్కిలి వేషాలు వేయడం వల్ల ఒక సింగర్ ఇతనిపై కేసు కూడా వేసింది.

ఇక ఇప్పుడు ఇతగాడు ఏకంగా రకుల్ ప్రీత్ సింగ్ ని అత్యంత దారుణంగా అవమానించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ కి ఆయనకు ఉత్తమ దర్శకుడు క్యాటగిరీలో అవార్డు వచ్చింది .ఈ అవార్డు ని రకుల్ ప్రీత్ సింగ్ చేత ఆర్యన్ ఖాన్ కి ఇప్పించారు ఈవెంట్ నిర్వాహకులు. ఈ అవార్డు ని అందుకోవడానికి స్టేజి మీదకు వచ్చిన ఆర్యన్ ఖాన్ , చాలా అగ్రెసివ్ గా రకుల్ చేతుల్లో నుండి అవార్డు తీసుకున్నాడు. కనీసం ఆమెవైపు నవ్వుతూ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. పాపం రకుల్ చాలా అవమానంగా ఫీల్ అయ్యింది.

ఆమె ఎక్స్ ప్రెషన్స్ ని మీరు ఈ క్రింది వీడియో లో చూడొచ్చు. ఆర్యన్ ఖాన్ యాటిట్యూడ్ ఆ సమయం లో నువ్వెంటి , నాకు అవార్డు ఇచ్చేది ఏంటి ?, నీకు అంత సినిమా ఉందా అని అవహేళన చేసినట్టు గా అనిపించింది ఆర్యన్ ఖాన్ ప్రవర్తన. ఈ వీడియో ని చూసిన నెటిజెన్స్ షారుఖ్ ఖాన్ ని ట్యాగ్ చేసి , ఏమి పెంపకం అయ్యా ?, నీ కొడుక్కి తోటి నటీనటులతో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పించలేదా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ అభిమానులకు కూడా దీని గురించి సమర్ధించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా లో వివాదాస్పదం గా మారిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Exit mobile version