spot_img
Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Updates: 'ధురంధర్ 2' లో ఆ పాత్ర లేకపోవడం పెద్ద మైనస్ కానుందా?...

Dhurandhar 2 Updates: ‘ధురంధర్ 2’ లో ఆ పాత్ర లేకపోవడం పెద్ద మైనస్ కానుందా? ఇలా అయితే కష్టమే!

Dhurandhar 2 Updates: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. ఈమధ్యనే ఈ చిత్రం నెట్ లైక్స్ లో విడుదలై 20 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన తర్వాత థియేటర్స్ నుండి ఈ చిత్రాన్ని అన్ని ప్రాంతాల్లో తీసేస్తారని అంతా అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో కూడా గణనీయమైన షోస్ తో ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. రీసెంట్ గా సంక్రాంతికి విడుదలైన సినిమాలకు కూడా ఇన్ని షోస్ లేవు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆడియన్స్ మొత్తం ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి భాగం రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అంటే అనుమానమే అని అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే మొదటి భాగం లో మన ఇండియా పై జరిగిన ఉగ్రదాడులకు సంబంధించిన యదార్ధ ఘటనలను ఆధారంగా తీసుకొని చిత్రీకరించిన సన్నివేశాలు ఆడియన్స్ కి థియేటర్స్ లో రక్తం మరిగించేలా చేశాయి. కానీ సీక్వెల్ లో ఇలాంటి యదార్ధ ఘటనలను చూపించే స్కోప్ లేదు. కేవలం కల్పిత సన్నివేశాలు మాత్రమే చూపిస్తారు. ఇది ఆడియన్స్ లో అంత ప్రభావం చూపించకపోవచ్చు. అది కాసేపు పక్కన పెడితే ‘ధురంధర్’ చిత్రం అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణాలలో ఒకటి అక్షయ్ ఖన్నా నటన. ఇందులో ఆయన రెహమాన్ డెకాయిట్ పాత్రలో నటించలేదు , జీవించాడు అనే చెప్పాలి. ఆయన పాత్ర హీరో కంటే పవర్ ఫుల్. క్లైమాక్స్ లో ఇతన్ని అడ్డుకోవడానికి హీరో పాత్రతో పాటు , సంజయ్ దత్ సపోర్టు కూడా కావాల్సి వచ్చింది. వాళ్ళు ఇద్దరూ కూడా రెహమాన్ ని కంట్రోల్ చేయలేకపోతారు.

చివరికి చనిపోయేటప్పుడు కూడా ఆయన పాత్ర ఇచ్చిన ఇంపాక్ట్ సాధారణమైనది కాదు . థియేటర్స్ నుండి బయటకు హీనా తర్వాత కూడా రెహమాన్ పాత్రని జనాలు మర్చిపోలేరు. అసలు రెహమాన్ లేని ‘ధురంధర్’ ని ఊహించుకోవడమే కష్టం అని కూడా చెప్పొచ్చు. అలాంటి పవర్ ఫుల్ పాత్ర ‘ధురంధర్ 2’ లో ఉండదట . ఫ్లాష్ బ్యాక్ లో రెండు మూడు సన్నివేశాల్లో కనిపించొచ్చు కానీ , నిడివి చాలా తక్కువగా ఉంటుందట . మరి రెహమాన్ లేని ‘ధురంధర్ 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాని మార్చి 19 న హిందీ తో పాటు తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా విడుదల కాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...
Oktelugu Epaper
Exit mobile version