Akhanda 2 Teaser Review: బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమా ఈనెల 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న అంగ రంగ వైభవంగా నిర్వహించారు. సినిమా మీద మరింత హైప్ ని పెంచడానికి ‘అఖండ మాసివ్ తాండవం’ అంటూ ఒక టీజర్ ను రిలీజ్ చేశారు…ఈ టీజర్ మొత్తం లో బాలయ్య విలయ తాండవమే కనిపించింది. బాలయ్య తన రాజసాన్ని చూపిస్తూ విలన్స్ గుండెల్లో మోత మోగించాడు…’అలాగే కొండల్లో తొండ లని తిని బతికే ఇక్కడ ప్రతి కొండని క్షేత్రంగా భావించి మేమెక్కడ’ అంటూ బాలయ్య బాబు చెప్పిన డైలాగులకు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక థియేటర్లో మాత్రం ఈ డైలాగులకు విజిల్స్ పడడం పక్క అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే బాలయ్య బాబు అఖండ 2 సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి ఒక ఫైర్ ఉంటుంది. ఈ సినిమాలో ఆ ఫైర్ చాలా ఎక్కువగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
అఖండ2 సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో అఖండ 2 మూవీ దానిని మించిన సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఈ సినిమాని తీస్తున్నారు. కాబట్టి ఒక ఆ ధర్మాన్ని దాని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి సినిమాను చూసి ఆదరించాలని సినిమా యూనిట్ కోరుకుంటున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే బాలయ్య వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడవుతాడు. లేకపోతే మాత్రం తను కొంతవరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కానీ అఖండ 2 సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ ను కనక చూసినట్టయితే ఈ సినిమా కచ్చితంగా సూపర్ సక్సెస్ ని సాధిస్తోందనేది చాలా క్లారిటీ గా తెలుస్తోంది…
