Homeఎంటర్టైన్మెంట్Akhanda 2 Movie Budget: అఖండ 2తో భారీ రిస్క్ చేస్తున్న బాలయ్య, సాధ్యమయ్యే పనేనా?

Akhanda 2 Movie Budget: అఖండ 2తో భారీ రిస్క్ చేస్తున్న బాలయ్య, సాధ్యమయ్యే పనేనా?

Akhanda 2 Movie Budget: అఖండ(AKHANDA) మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు నటసింహం బాలకృష్ణ. అప్పటి వరకు ఆయనకు క్లీన్ హిట్ లేదు. చెప్పాలంటే వరుస డిజాస్టర్స్ పడ్డాయి. బాలకృష్ణ మార్కెట్ భారీగా పతనమైంది. పది కోట్ల గ్రాస్ సైతం రాబట్టలేని పరిస్థితికి బాలయ్య చేరాడంటే అతిశయోక్తి కాదు. 2014లో విడుదలైన లెజెండ్ తర్వాత బాలకృష్ణకు క్లీన్ హిట్ పడలేదు. గౌతమీపుత్ర శాతకర్ణి మాత్రమే పర్లేదు అనిపించుకుంది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు ట్రిపుల్ డిజాస్టర్ అని చెప్పాలి. ఎన్టీఆర్ బయోపిక్S గా తెరకెక్కిన ఆ చిత్రాలు బాలయ్యకు భారీ షాక్ ఇచ్చాయి.

ఇక రూలర్ తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. బాలయ్య(NANDAMURI BALAKRISHNA) పని అయిపొయింది అనుకుంటున్న తరుణంలో అఖండ రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. అఖండ బడ్జెట్ రీత్యా అది భారీ విజయం అని చెప్పొచ్చు. బాలకృష్ణకు ఒక కమ్ బ్యాక్ లాంటి సినిమా. దీనికి సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీజర్ సైతం విడుదల చేశారు. సెప్టెంబర్ 25న అఖండ 2 థియేటర్స్ లోకి రానుంది. వాయు వేగంతో అఖండ 2 చిత్రీకరణ జరుగుతుంది.

Also Read: 60 షోస్ నుండి 70 వేల డాలర్లు.. అమెరికా లో ‘హరి హర వీరమల్లు’ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్!

అయితే అఖండ 2(AKHANDA 2 BUDGET) బడ్జెట్ చిత్ర వర్గాలను విస్మయానికి గురి చేస్తుంది. ఈ చిత్రానికి ఏకంగా రూ. 160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. బాలకృష్ణ మార్కెట్ రీత్యా ఇది భారీ రిస్క్ అనడంలో సందేహం లేదు. అఖండ చిత్రాన్ని రూ.50-60 కోట్లతో నిర్మించారు. రూ. 100 కోట్లకు పైగా వసూళ్లతో అఖండ నిర్మాతకు పెద్ద మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టింది. అనంతరం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ జస్ట్ హిట్. కేవలం బ్రేక్ ఈవెన్ దాటి హిట్ ఖాతాలో చేరాయి.

అఖండ 2 చిత్రానికి ఆ స్థాయి బడ్జెట్ అంటే… రూ. 200 కోట్ల మేర బిజినెస్ చేయాలి. అంతటి ఫ్యాన్సీ ధరకు అఖండ 2 చిత్రాన్ని బయ్యర్లు కొంటారా? అనేది సందేహమే. ఎంత హిట్ కాంబినేషన్ అయినప్పటికీ బాలయ్య మార్కెట్ దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఇప్పటి వరకు బాలయ్యకు రూ. 200 కోట్లు గ్రాస్ రికార్డు లేదు. కాబట్టి అఖండ 2తో బాలకృష్ణ రిస్క్ చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు.

అఖండ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. అఖండ 2కి నిర్మాతలు మారారు. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ భాగస్వామ్యంతో బాలయ్య కుమార్తె తేజస్విని అఖండ 2 చిత్రాన్ని నిర్మించడం విశేషం.

Exit mobile version