Akhanda 2 Latest Teaser: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే, కచ్చితంగా ఓవర్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఇక ‘అఖండ’ లాంటి సినిమాకు సీక్వెల్(Akhanda 2 Thandavam) అంటే, ఏ రేంజ్ మాస్ సన్నివేశాలు ఉంటాయో ఊహించుకోవచ్చు. ఆ ఊహకు తగ్గట్టుగానే విడుదల చేసిన రెండు ట్రైలర్స్ ఉన్నాయి. హద్దులు దాటినా మాస్ సన్నివేశాలు, అసలు ఇంత అవసరమా అని అనిపించేలా ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం డిసెంబర్ 12 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా, మేకర్స్ కాసేపటి క్రితమే ఒక టీజర్ వీడియో ని విడుదల చేశారు. ఈ టీజర్ కి మామూలు ఫ్యాన్స్ నుండి మాత్రమే కాదు, నందమూరి ఫ్యాన్స్ నుండి కూడా డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా ఆ టీజర్ చూడగానే, ఇదేందయ్యా ఇది, నేనెప్పుడూ చూడాలా అనే మూమెంట్ ప్రతీ ఒక్కరికి వస్తుంది.
మనిషిని తలా క్రిందలుగా చేసి, చరచేతిలో పెట్టుకొని, తన మేనకోడలికి దిష్టి లాగా, నేలకేసి కొట్టడాన్ని చూసి ఆడియన్స్ కి నవ్వాలో, కోపం తెచుకోవాలో తెలియని పరిస్థితి. ఎదో ఒక్క షాట్ ఇలాంటిది ఉంటే పర్వాలేదు, ప్రతీ షాట్ లో ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఓవర్ డోస్ లాగా అనిపిస్తుంది. ఈ టీజర్ చూసిన తర్వాత అదే అనిపించింది. దీన్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు, కానీ కామెడీ దారిలో అలోచించి ఎంజాయ్ చేసేవాళ్ళే ఉంటారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇలాంటి సన్నివేశాలు ఉంటాయని ఊహిస్తాం, కానీ ప్రతీ షాట్ లోనూ ఇలాంటివే ఉంటాయంటే తీసుకోవడం కష్టమే కదా. మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. అఖండ చిత్రం లో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఓవర్ డొసేజ్ లేదు, బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ని వేరే లెవెల్ లో వాడుకున్నాడు బోయపాటి.
కానీ ఇక్కడ మా కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ సినిమా కాబట్టి, ఈ రేంజ్ మాస్ సన్నివేశాలు ఉండాల్సిందే అని గిరి గీసుకొని తీసినట్టుగా అనిపించింది ఈ సినిమా టీజర్స్ ని, ట్రైలర్స్ ని చూస్తుంటే. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ రేపటి రాత్రి నుండి మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయ్. ప్రస్తుతానికి మొదటి రోజుకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. రేపు ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బుక్ మై షో యాప్ ఈ చిత్రానికి గంటకు 16 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. చూస్తుంటే బంపర్ ఓపెనింగ్ వచ్చేలాగానే ఉంది.