Akhanda 2 worldwide collections: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని తెచ్చుకోవడం వల్ల, బయ్యర్స్ కి భారీ నష్టాలు కలిగాయి. నందమూరి ఫ్యామిలీ కి కంచు కోటలుగా పిలవబడే సీడెడ్,గుంటూరు మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ సినిమా ప్రస్తుతం డెఫిసిట్స్ మీద నడుస్తోంది. సరైన కొత్త సినిమా కోసం బయ్యర్స్ ఎదురు చూస్తున్నారు. కొత్త సినిమాలు రాగానే థియేటర్స్ నుండి ఈ చిత్రాన్ని తొలగించేందుకు ఎదురు చూస్తున్నారు. అలా ఉంది పరిస్థితి, అయితే బాలయ్య కి వీక్ జోన్ గా పిలవబడే నైజాం ప్రాంతం లో ఈ చిత్రం డీసెంట్ స్థాయి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని నైజాం ప్రాంతానికి గాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసాడు.
20 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, 12 రోజులకు 18 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నైజాం ప్రాంత ప్రజలకు సినిమాలోని కొన్ని మాస్ సన్నివేశాలు హద్దులు దాటినట్టు అనిపించినప్పటికీ, దైవానికి సంబంధించిన సన్నివేశాలు కొన్ని బాగా చూపించాడని , అది అక్కడి ఆడియన్స్ కి నచ్చడం వల్లే ఇంత థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి చాలా దగ్గరగా వెళ్తుందని అంటున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే సీడెడ్ నుండి 11 కోట్ల 50 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 5 కోట్ల 40 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 4 కోట్ల 17 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 18 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 12 రోజులకు గాను 54 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 62 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 4 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 66 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిరానికి కచ్చితంగా మరో 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అది దాదాపుగా అసాధ్యం, ఈ వీకెండ్ తో థియేట్రికల్ రన్ కూడా దాదాపుగా క్లోజ్ అయ్యినట్టే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.