Akash Puri: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వదిలిన ‘రొమాంటిక్’ ట్రైలర్..

Akash Puri: పూరీజగన్నాథ్ తనయుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మారి…  సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధం అయ్యాడు ఆకాష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే […]

Written By: Raghava Rao Gara, Updated On : October 19, 2021 5:44 pm
Follow us on

Akash Puri: పూరీజగన్నాథ్ తనయుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మారి…  సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధం అయ్యాడు ఆకాష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్.

ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. ఇక ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు.

ట్రైలర్‌ను విడుదల చేసిన డార్లింగ్ చిత్రయూనిట్ కు విషెస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే గతంలో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుందని టాక్ వినిపించింది. అంతే కాదు ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ సినిమా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించందని తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ ట్రెయిలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.