https://oktelugu.com/

క్లైమాక్స్ లో ఆకాష్ పూరి అలా రెచ్చిపోతాడట!

దర్శకుడు పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీని మే 29న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో ఆకాశ్ పూరికి జోడిగా కొత్తభామ కేతికాశర్మ నటిస్తుంది. ఈ మూవీ పూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీకి కథను పూరినే సమకూర్చాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త దర్శకుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 13, 2020 / 03:46 PM IST
    Follow us on


    దర్శకుడు పూరి జగన్మాథ్ తనయుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్’. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీని మే 29న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. ఈ మూవీలో ఆకాశ్ పూరికి జోడిగా కొత్తభామ కేతికాశర్మ నటిస్తుంది. ఈ మూవీ పూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ తరహాలో ఉండనుందని తెలుస్తోంది. ఈ మూవీకి కథను పూరినే సమకూర్చాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ‘రొమాంటిక్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. పూరి జగన్నాథ్ బాన్యర్లో సమర్పిస్తున్న ఈ మూవీకి ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ మూవీకి సంబంధించి ఫస్టు లుక్కు, సాంగ్స్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఫస్టు లుక్కుతోనే ఈ సినిమాలో రోమాన్స్ ఏమేరకు ఉంటుందో దర్శకుడు చూపించాడు. ఫుట్ బోర్డుపై హీరోయిన్ ను గాఢంగా లిక్ లాక్ చేసే సన్నివేశాన్ని ఫస్టు లుక్కులోనే చూపించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు అనిల్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది.

    ఇద్దరు ప్రేమికుల మధ్య నడిచే గాఢమైన ప్రేమతో కూడుకున్న సీరియస్ లవ్ స్టోరీ గా ‘రొమాంటిక్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో రోమాన్స్ ఎక్కువ అవకాశం ఉండటంతో దర్శకుడు వీలైనంతగా రోమాన్స్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నాటం. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ అదిరిపోయేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. క్లైమాక్స్ లో హీరోహీరోయిన్ల మధ్య గాఢమైన లిప్ లాక్ ఉంటుందట. ‘రొమాంటిక్’ సినిమాకు ఎండ్ కార్డ్ లాప్ లాక్ తోనే పడనుంది. కరోనా ఎఫెక్ట్ తగ్గుముఖం పడితే తప్ప ఈ మూవీని అనుకున్న టైంకి రావడం కష్టమనే చెప్పాలి. చూడాలి మరీ ఏం జరుగుతోందో..!