Puri-Charmi Bond: టాలీవుడ్లో డాషింగ్ డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కు మంచి గుర్తింపు ఉంది. ట్రెండ్ సెట్ చేసే సినిమాలు తీయడంలో పూరీ జగన్నాథ్ సిద్ధహస్తుడు, ‘పోకిరి’.. చిరుత’.. ‘బిజినెస్మెన్’ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నా యి. అయితే కొంతకాలంగా ఫ్లాపులతో సతమవువుతున్న పూరీ జగన్మాథ్ రీసెంట్ గా ‘ఇస్మార్ట్ శంకర్’ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం విజయ దేవరకొండతో ‘లైగర్’ అనే ప్యాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు.

పూరి జగన్మాథ్ ఎంతోమంది హీరోలకు హిట్లచ్చి స్టార్ హీరోలుగా మార్చారు. అయితే అతని తమ్ముడు సాయిరాం, కొడుకు పూరి ఆకాశ్ లను మాత్రం స్టార్స్ చేయలేకపోయాడు. వీరిద్దరు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. సాయిరాం ఇప్పటికే ఫేడ్ అవుట్ కాగా ఆకాష్ పూరికి సరైన హిట్ పడలేదు. దీంతో ఆకాష్ పూరి కెరీర్ డోలాయమానంలో పడింది.
పూరి జగన్మాథ్ దర్శకత్వంలోపాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఛార్మి సైతం పూరీతో జత కలిసింది. హీరోయిన్ ఛాన్సులు తగ్గుతున్న క్రమంలోనే ఛార్మి నిర్మాతగా మారారు. పూరీతో కలిసి పలు సినిమాలను నిర్మిస్తున్నారు. వీరిద్దరు తరుచూ కలుస్తుండటంతో వీరిమధ్య అఫైర్ ఉందనే గాసిప్స్ మొదలయ్యాయి. పూరి జగన్మాథ్ తన భార్యకు విడాకులిచ్చి చార్మిని పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు షికార్లు చేశాయి.
ఇలాంటి వార్తలపై పూరీ జగన్మాథ్ కుమారుడు ఆకాష్ పూరీ తనదైన శైలిలో స్పందించాడు. “ఛార్మీ గారు చాలా మంచి వారు.. చాలా టాలెంట్ ఉంది.. మా నాన్న ఛార్మి గారికి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.. నాన్నకు ఛార్మి చాలా సపోర్టివ్ గా ఉంటారు.. ముఖ్యంగా చెప్పాలంటే ప్రొడక్షన్ ఫీల్డ్ లో చాలా ప్రొఫెషనల్ గా ఆలోచిస్తారు.. నాన్న డైరెక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ప్రతీసారి.. నిర్మాణ రంగంలో ఛార్మి గారు బాగా హెల్ప్ చేస్తారు.. మంచి స్నేహ బంధం ఉంది కాబట్టే మా నాన్న ఛార్మిని వదలరు” అంటూ ఆకాష్ పూరి ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రోమాంటిక్’ మూవీ ఛార్మినే ప్రొడ్యూసర్. అలాగే పూరీ జగన్మాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ మూవీకి చార్మి పూరితో కలిసి కో ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగు, హిందీతోపాటు వివిధ భాషల్లో రిలీజ్ చేసేందుకు పూరి అండ్ కో ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఛార్మిని పూరి వదిలే ప్రసక్తే లేదని అతడి కుమారుడు ఇన్ డైరెక్టర్ హింట్ ఇవ్వడం కొసమెరుపు.