సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోటీకి దిగడం అంటే.. అది సాహసమే. కానీ మరో తమిళ స్టార్ అజిత్, రజినీతో పోటీ పడనున్నారని తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీరి ఇద్దరి సినిమాలు ఈ దీపావళికి పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. రజినీకాంత్ ప్రస్తుతం ‘అన్నత్తే’ సినిమా చేస్తున్నాడు. ఇది దీపావళి కానుకగా నవంబర్ 4న రిలీజ్ కాబోతుందని ఇప్పటికే మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు.
అయితే, రజినీ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసినా.. అజిత్ కొత్త సినిమా ‘వలిమై’ కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. కానీ ‘వలిమై’ కూడా నవంబర్ 4నే థియేటర్లలోకి వస్తే.. భారీ పోటీ మధ్య ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ పరంగా కొంత లాస్ జరిగే అవకాశం ఉంది.
అసలుకే ఈ ఏడాదిలో తమిళ ఇండస్ట్రీలో పెద్దగా హిట్స్ కూడా లేవు. కేవలం విజయ్ నటించిన మాస్టర్ మాత్రమే తమిళనాడులో విజయం సాధించింది. మళ్ళీ తమిళ బాక్సాఫీస్ ఖాళీ అయిపోయింది. కాబట్టి, కోలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా ఊపు రావాలంటే పెద్ద సినిమాలు గ్యాప్ తో రిలీజ్ అవ్వాలి. అయితే, తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు కాబట్టి, స్టార్ హీరోలు ఈ రెండు పండుగలనే ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు.
అందుకే, దీపావళికి రజిని – అజిత్ తమ సినిమాలను పోటీలో ఉంచారు. కాకపోతే, ఈ కరోనా సంక్షోభ కాలంలో ఇలా పెద్ద హీరోల పెద్ద సినిమాలను ఒకే రోజు విడుదల చెయ్యడం అవసరమా అని తమిళ సినీ వర్గాల్లో బ్యాడ్ టాక్ నడుస్తోంది. మరి చివరకు ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా అజిత్ సినిమా పోస్ట్ ఫోన్ అవొచ్చు.