
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసుల్లో పది శాతం పిల్లల కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా సోకిన పిల్లల్లో చిన్నారులతో పాటు శిశువులు కూడా ఉన్నట్లు పుదచ్చేరి ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ అరుణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచుతున్నామని చెప్పారు.