Game Changer and Vidamuyarchi : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన మొట్టమొదటి పెద్ద సినిమా ‘గేమ్ చేంజర్’. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ని అయితే రాబట్టింది కానీ, క్లోజింగ్ మాత్రం దారుణమనే చెప్పాలి. 500 నుండి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ఈ చిత్రం డిజాస్టర్ టాక్ కారణంగా కేవలం 200 కోట్ల రూపాయిల వద్దనే ఆగిపోయింది. అయితే నేడు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ హీరో గా నటించిన ‘విడాముయార్చి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడు వరకు ఓపెనింగ్స్ విషయం లో ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తుంది కానీ, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మాత్రం అనుకున్న రేంజ్ వసూళ్లు రావడం లేదు.
గత ఐదేళ్ల నుండి అజిత్ కి ఓవర్సీస్ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. కేవలం తమిళ నేటివిటీ కి తగ్గ సినిమాలు తీస్తుండడంతో తెలుగు లో కూడా ఆయన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. దీంతో కేవలం మొదటి రోజు 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఓవర్సీస్ మొత్తం కలిపి ఈ చిత్రానికి రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు కూడా రావడం కష్టమే మొదటి రోజు. మరోపక్క రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి మొదటిరోజు దాదాపుగా 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ అది రామ్ చరణ్ రేంజ్ కాదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో ట్రోల్స్ జరగడం మనమంతా చూసాము. కానీ సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా పిలవబడే అజిత్ కి ‘గేమ్ చేంజర్’ కి వచ్చిన మొదటి రోజు వసూళ్ళలో సగం మాత్రమే వచ్చింది.
ఇప్పడు దీనిపై తమిళ హీరో విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళంలో వరుసగా రెండు సార్లు మొదటిరోజు వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఏకైక హీరో విజయ్ మాత్రమే. ఈ ఏడాది మరో పెద్ద హీరో సినిమా వచ్చే వరకు ‘గేమ్ చేంజర్’ మూవీ ఓపెనింగ్ ఈ ఏడాది నెంబర్ 1 గా ఉండొచ్చు. వచ్చే నెల 28న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా కచ్చితంగా ‘గేమ్ చేంజర్’ మొదటి రోజు వసూళ్ల కంటే ఎక్కువే రాబడుతుంది. కానీ చెప్పిన తేదికి సినిమా వస్తుందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. అదే విధంగా ఇదే ఏడాది విజయ్ ‘జన నాయగన్’ , ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రాలు కూడా రాబోతున్నాయి. వీటికి కూడా ‘గేమ్ చేంజర్’ ని ఓపెనింగ్స్ ని దాటే అవకాశాలు ఉన్నాయి.