https://oktelugu.com/

కరోనా కి స్టార్స్ ఏమీ అతీతులు కారు

కోవిడ్ 19 అనబడే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దాంతో యెంత గొప్ప వ్యక్తి అయినా, సెలబ్రిటీలు అయినా ఈ వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాల నుండి మనదేశానికి తిరిగివస్తున్న సెలబ్రిటీలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే విదేశీ పర్యటన నుండి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి కరోనా సోకడం తో ఆ జాగ్రత్త మరీ ఎక్కువైంది. ఆ క్రమం లో ప్రముఖ హిందీ నటుడు, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో […]

Written By:
  • admin
  • , Updated On : March 31, 2020 / 06:36 PM IST
    Follow us on

    కోవిడ్ 19 అనబడే కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం వణికిపోతోంది. దాంతో యెంత గొప్ప వ్యక్తి అయినా, సెలబ్రిటీలు అయినా ఈ వైరస్ బారి నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానంగా విదేశాల నుండి మనదేశానికి తిరిగివస్తున్న సెలబ్రిటీలపై అందరి దృష్టి ఉంది. ఇప్పటికే విదేశీ పర్యటన నుండి తిరిగొచ్చిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి కరోనా సోకడం తో ఆ జాగ్రత్త మరీ ఎక్కువైంది. ఆ క్రమం లో ప్రముఖ హిందీ నటుడు, ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న అజయ్ దేవగన్ కుటుంబానికి సైతం కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి .

    ఇంతకీ అసలు విషయం ఏమిటంటే అజయ్ దేవగన్, కాజోల్ కుమార్తె నిశా సింగపూర్లో చదువుకుంటోంది. కరోనా ప్రభావం కారణంగా ఆమెను కాజోల్ స్వయంగా సింగపూర్ వెళ్ళి ముంబై తీసుకు రావడం జరిగింది. దాంతో కాజోల్, నిశా ఇద్దరూ వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులుగా సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు.. దీంతో వారికి కరోనా ఎఫెక్ట్ అయిందనే పుకార్లు పుట్టుకొచ్చాయి. వీటిపై స్పందించిన అజయ్ దేవగన్ కాజోల్, నిశా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, వారికి కరోనా సోకినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరించారు

    కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృభిస్తోంది . అందులో భాగంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ నివాసంలో ఆరోగ్య శాఖాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి లిస్ట్ ను రెడీ చేసుకున్న తమిళనాడు ప్రభుత్వం అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ ఇంటికి వెళ్లి విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని తెల్సుకొని అంతా ఊపిరి పీల్చుకొన్నారు .రూ ఆరోగ్యంగా ఉన్నారని నొక్కి చెప్పారు .