Ajay Devgn: నిమిషానికి అక్షరాలా 4.5 కోట్లు..పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ ని అవలీలగా దాటేసిన సీనియర్ హీరో!

బాలీవుడ్ హీరోలు మన టాలీవుడ్ డైరెక్టర్స్ తో పని చెయ్యడానికి తహతహలాడుతున్నారు. దర్శకులతో పని చేయకపోయినా, కనీసం మన స్టార్ హీరోల సినిమాల్లో చిన్న క్యారక్టర్ దొరికినా మహా ప్రసాదం లాగా భావిస్తున్నారు. ఆ స్థాయికి మన ఇండస్ట్రీ చేరింది. అయితే కొంతమంది బాలీవుడ్ హీరోలు మన టాలీవుడ్ స్టార్స్ చిత్రాల్లో నటించడానికి సిద్దమే కానీ, రెమ్యూనరేషన్స్ ని భారీ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : September 19, 2024 10:03 am

Ajay Devgn

Follow us on

Ajay Devgn: బాలీవుడ్ లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్న ఎంతో మంది ఇప్పుడు మన సౌత్ సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ హీరోలకు చాలా తలపొగరు ఉండేది. మన సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమ అంటే ఇసుమంత గౌరవం కూడా లేదు. మన హీరోలన్నా, మన డైరెక్టర్స్ అన్నా బాలీవుడ్ వారికి చిన్న చూపు. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో ఇతర భాషల్లో మనకి దక్కుతున్న అవమానాల గురించి ఎంతో భావోద్వేగపూరితమైన ప్రసంగం ఇచ్చాడు. అలాంటి పరిస్థితి నుండి నేడు మన ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఎదిగిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఏకంగా హాలీవుడ్ వరకు మన ప్రఖ్యాతలు విస్తరించి ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకునేలా చేసింది.

ఇప్పుడు బాలీవుడ్ హీరోలు మన టాలీవుడ్ డైరెక్టర్స్ తో పని చెయ్యడానికి తహతహలాడుతున్నారు. దర్శకులతో పని చేయకపోయినా, కనీసం మన స్టార్ హీరోల సినిమాల్లో చిన్న క్యారక్టర్ దొరికినా మహా ప్రసాదం లాగా భావిస్తున్నారు. ఆ స్థాయికి మన ఇండస్ట్రీ చేరింది. అయితే కొంతమంది బాలీవుడ్ హీరోలు మన టాలీవుడ్ స్టార్స్ చిత్రాల్లో నటించడానికి సిద్దమే కానీ, రెమ్యూనరేషన్స్ ని భారీ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు. ఉదాహరణకు #RRR చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రామ్ చరణ్ కి తండ్రి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర సమరయోడిదిగా, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే వీరుడిగా ఇందులో అజయ్ దేవగన్ కనిపిస్తారు. అయితే ఆయన స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ సేపు అయినప్పటికీ కూడా, రెమ్యూనరేషన్ భారీ మొత్తం లో అందుకున్నట్టు తెలుస్తుంది.

మొత్తం మీద ఈ సినిమా కోసం అజయ్ దేవగన్ 8 రోజులు పని చేసాడు. 8 రోజులకు గాను ఆయన 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. అంటే రోజుకి కోటి రూపాయిలు అన్నమాట. మరోపక్క బాలీవుడ్ లో డియోల్ కుటుంబం నుండి హీరో గా వచ్చి మంచి పేరు తెచ్చుకున్న బాబీ డియోల్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో విలన్ గా బాగా ఫేమస్ అయిపోయాడు. ముఖ్యంగా ‘ఎనిమల్’ చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈయన టాలీవుడ్ లో ‘హరి హర వీరమల్లు’, ‘దేవర’ తో పాటుగా బాలయ్య మూవీ లో కూడా విలన్ గా నటిస్తున్నాడు. దేవర చిత్రంలో బాబీ డియోల్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ఈ సినిమాలో ఆయన కనిపిస్తాడట. నాలుగు నిమిషాల కోసం ఆయన నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్ర పార్ట్ 2 లో పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి అంత రెమ్యూనరేషన్ ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు.