Ajay Bhupathi: కృష్ణకు ఇద్దరు కుమారులు కాగా, మహేష్ బాబు టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. కృష్ణ నట వారసత్వాన్ని నిలబెడుతూ అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఆయన ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణ అన్నయ్య రమేష్ బాబు సైతం హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆయన స్టార్ కాలేకపోయాడు. కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ రావడం విశేషం. రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు జయకృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. జయకృష్ణ హీరో కానున్నది గతంలో వార్తలు వచ్చాయి. ఆయన విదేశాల్లో కూడా శిక్షణ తీసుకుంటున్నాడని కథనాలు వెలువడ్డాయి.
Also Read: రాజమౌళి సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించబోతున్న స్టార్ హీరో…
హీరోగా జయకృష్ణ అరంగేట్రం చేసేందుకు సిద్ధం అయ్యాడు అనేది లేటెస్ట్ న్యూస్. జయకృష్ణను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసే బాధ్యత దర్శకుడు అజయ్ భూపతికి దక్కిందట. అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం అందుకుంది. రెండో చిత్రం మహాసముద్రం నిరాశపరిచింది. అయితే మంగళవారం మూవీతో మరో హిట్ కొట్టాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర చేసిన మంగళవారం ప్రేక్షకులను మెప్పించింది.
మంగళవారం 2 పనుల్లో ఉన్న అజయ్ భూపతి చేతికి జయకృష్ణ డెబ్యూ ప్రాజెక్ట్ వచ్చింది అనేది ఇండస్ట్రీ టాక్. జయకృష్ణ హీరో మెటీరియల్ అనడంలో సందేహం లేదు. సక్సెస్ అయితే కృష్ణ ఫ్యామిలీ నుండి మరో స్టార్ అవతరిస్తాడు. కాగా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయ్యాడు. ఆయన రెండు సినిమాలు చేశాడు. అశోక్ గల్లాకు ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన స్ట్రగుల్ అవుతున్నాడు.
మరోవైపు మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరో రెండు మూడేళ్లలో గౌతమ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి చిత్రంలో నటిస్తున్నారు. ssmb 29 వర్కింగ్ టైటిల్ గా ఉంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో ఇండియాలోనే అత్యంత భారీ చిత్రంగా రాజమౌళి రూపొందిస్తున్నారు.