Aishwarya Rai : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా మనం ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. మిస్ యూనివర్స్ కిటీటాన్ని సొంతం చేసుకున్న ఈ విశ్వ సుందరి కి మొట్టమొదట మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ, హిట్స్, బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ని అందుకుంటూ, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యువతకు కలల రాకుమారిగా మారిపోయింది. ప్రతీ ఒక్కరు తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఐశ్వర్య రాయ్ రేంజ్ ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నారంటే, ఆమె అందం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ బచ్చన్ తో పెళ్లి తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తుంది ఐశ్వర్య రాయ్.
Also Read : ఐశ్వర్య రాయ్ కి అరుదైన వ్యాధి? శరీరంలో ఆ మార్పుకు కారణం అదేనా?
ఆమె చివరిసారిగా కనిపించిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వివిధ రకాల షేడ్స్ ని అద్భుతంగా పలికించింది. అయితే రీసెంట్ గానే ఈమె డైలీ మెయిల్ తో ఒక చిట్ చాట్ చేసింది. ఇందులో ఆమె ముద్దు సన్నివేశాలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు హాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు. ఒక ప్రముఖ హాలీవుడ్ సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశం కూడా దక్కింది. కానీ ముద్దు సన్నివేశాలు అందులో చాలా ఉన్నాయి. అలాంటి సన్నివేశాల్లో ఇది వరకు నేను నటించలేదు కాబట్టి, చేయనని చెప్పాను. కేవలం ఆ ఒక్క సినిమా మాత్రమే కాదు, ఎన్నో హాలీవుడ్ సినిమాలను మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వస్తే ముందుగా మన ఇండియన్ మూవీస్ లోనే చేయాలి అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
అప్పట్లో ‘ధూమ్ 2’ మూవీ లో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ మధ్య వచ్చే లిప్ లాక్ సెన్సేషన్ ఎంతటి సెన్సేషన్ రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెద్ద వివాదాలకు కూడా దారి తీసింది ఈ సన్నివేశం. ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతూ, ఇలాంటి సన్నివేశాలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ అప్పట్లో ఆమెని నిలదీశారు. సొంత అభిమానులే ఆమెకు ఆరోజుల్లో లీగల్ నోటీసులు పంపిన ఘటన అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఐశ్వర్య రాయ్ సైతం ఆ నోటీసులను చూసి ఆశ్చర్యపోయిందట. ఇక ఆ తర్వాత నుండి లిప్ లాక్ సన్నివేశాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వచ్చిందట ఐశ్వర్య రాయ్. ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ఏ సినిమా లేదు. భవిష్యత్తులో మంచి క్యారక్టర్ దొరికితే కచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చింది ఐశ్వర్య రాయ్.
Also Read : పబ్లిక్ ఈవెంట్ లో గొడవపడిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్..సంచలనం రేపుతున్న వీడియో!