Kajal Agarwal : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్(Kajal Agarwal). లక్ష్మీ కళ్యాణం చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత ‘చందమామ’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని అందరి దృష్టిలో పడింది. ఇక రామ్ చరణ్(Global Star Ram Charan) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాతో ఆమె ఎంతటి క్రేజ్ ని సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు కేవలం మామూలు హీరోయిన్ గా మాత్రమే ఇండస్ట్రీ లో కొనసాగుతూ వచ్చిన కాజల్ అగర్వాల్, ఈ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యూత్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఆమె మంచి క్రేజ్ ని సంపాదించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె ఇంకా అదే క్రేజ్ తో కొనసాగుతుంది.
Also Read : తెలుగు సినిమాలను ఇక USA లో చూడలేమా..కోలుకోలేని షాక్ ఇచ్చిన డోనాల్డ్ ట్రంప్!
అయితే క్రేజ్ అయితే బాగానే ఉంది కానీ, రీసెంట్ సమయం లో ఆమెకు సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మని ఇచ్చిన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ అందం చెక్కు చెదరలేదు. అయినప్పటికీ కూడా కొత్త హీరోయిన్స్ రాకతో ఆమెకు అవకాశాలు రావడం లేదు. కేవలం హీరోయిన్ క్యారెక్టర్స్ కి మాత్రమే తాను పరిమితం కావాలని అనుకోవడం లేదని, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉందని, విలన్ క్యారెక్టర్స్ అయినా పర్లేదని ఆమె అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. కానీ ఎందుకో ఆమె వైపు కేవలం సీనియర్ హీరోలు తప్ప యంగ్ హీరోలు చూడడం లేదు. అయితే విశేషం ఏమిటంటే కాజల్ అగర్వాల్ కేవలం నాగార్జున, వెంకటేష్ తో తప్ప, టాలీవుడ్ లోని అందరి హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇంతమందితో కలిసి పనిచేసిన కాజల్ అగర్వాల్ కి అత్యంత ఇష్టమైన హీరో ఎవరు అనేది ఇన్ని రోజులు తెలీదు.
కానీ రీసెంట్ గానే ఆమె ఒక ఈవెంట్ లో తన అభిమాన హీరో ఎవరు అనే దానిపై ఓపెన్ అయిపోయింది. ఒక యాంకర్ కాజల్ అగర్వాల్ ని ప్రశ్న అడుగుతూ ‘పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గారితో ఇప్పటీకే ఒక సినిమా చేశారు, భవిష్యత్తులో కూడా అవకాశం వస్తే చేస్తారా’ అని అడగ్గా, దానికి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమానిని, అవకాశం వస్తే చేయకుండా ఉంటానా?, కచ్చితంగా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. గతంలో ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. మళ్ళీ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూద్దాం.