https://oktelugu.com/

Aishwarya Rai: ప్రతీకారానికి అందమైన రూపమే ఐశ్వర్య రాయ్

Aishwarya Rai: మణిరత్నం ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌ తో ‘పొన్నియిన్ సెల్వన్’ (PS-1) అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. పైగా ఈ సినిమాలో విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి నటీనటులను పెట్టుకున్నాడు మణిరత్నం. సినిమాకి మార్కెట్ కావాలి అంటే.. స్టార్ నటీనటులు ఉండాలి. అందుకే.. ఐశ్వర్య రాయ్‌ కూడా ఈ సినిమాలో నటించేలా మణిరత్నం ఆమెను ఒప్పించాడు. అయితే, ఐశ్వర్య […]

Written By:
  • Shiva
  • , Updated On : July 7, 2022 / 04:35 PM IST
    Follow us on

    Aishwarya Rai: మణిరత్నం ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌ తో ‘పొన్నియిన్ సెల్వన్’ (PS-1) అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు. పైగా ఈ సినిమాలో విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి నటీనటులను పెట్టుకున్నాడు మణిరత్నం. సినిమాకి మార్కెట్ కావాలి అంటే.. స్టార్ నటీనటులు ఉండాలి. అందుకే.. ఐశ్వర్య రాయ్‌ కూడా ఈ సినిమాలో నటించేలా మణిరత్నం ఆమెను ఒప్పించాడు.

    Aishwarya Rai

    అయితే, ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ లుక్ లో మాజీ విశ్వ సుందరి తన అందచందాలతో అదరగొట్టేసింది. ఆమె పజూహూర్ రాణి నందిని క్యారెక్టర్‌‌ లో కనిపించబోతుంది. ప్రతీకారానికి అందమైన రూపమే పజూహూర్ రాణి నందిని క్యారెక్టర్‌‌. ఈ పాత్రలో ఐశ్వర్య రాయ్ లుక్ చాలా బాగుంది. అందుకే.. ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

    Also Read: Leena Manimekalai : దేవుళ్లతో గేమ్స్: నిన్న స్మోకింగ్ కాళీ, నేడు స్మోకింగ్ శివపార్వతులు.. లీనా పెనుదుమారం

    క్లాసిక్ డైరెక్టర్ గా మణిరత్నంకి మంచి పేరు ఉంది. అందుకే ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం 2022, సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన వర్క్ మరో రెండు నెలల్లో పూర్తి కానుంది. ఇక ఈ సినిమా కథ.. రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే కథ కావడంతో సినిమాలో అత్యున్నత భారీ తారాగణం నటిస్తోంది.

    విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో పాటు ప్రకాష్ రాజ్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే, అందరిలో కల్లా… ఐశ్వర్య రాయ్ పాత్ర కీలకం. ఇక మణిరత్నం ఈ సినిమా తర్వాత ఇక డైరెక్షన్ చెయ్యడు అని, దర్శకత్వం పక్కన పెట్టి, నిర్మాతగా మారాలని మణిరత్నం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాడని టాక్.

    Ponniyin Selvan

    తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ మణిరత్నం సినిమాలను నిర్మించాలనుకుంటున్నారు. కాకపోతే అవి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సంస్థలకు మాత్రమే మణిరత్నం సినిమాలు చేస్తాడట. అంటే.. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. తనకు నష్టాలు లేకుండా ఉండాలని మణిరత్నం ఆలోచన.

    ఇక ఈ “పొన్నియన్ సెల్వన్” సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాట బాగా ప్రాచుర్యం ఉన్న చోళులకు సంబంధించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది.

    Also Read:Lavanya Tripathi Marriage With Varun Tej: వరుణ్ తేజ్ తో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాటి

    Tags