Senior Heroine Trisha: హీరోయిన్ త్రిషకి ఇంకా ఆశ తగ్గలేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎప్పుడో పేడ్ అవుట్ అయిపోయి.. పెళ్లి కూడా చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. కానీ, త్రిష మాత్రం ఇంకా అవకాశాల కోసం అర్రులు చాస్తోన్న ఉంది. ‘ఈ ముదురు హీరోయిన్ మాకొద్దు మహాప్రభో’ అంటూ యంగ్ హీరోలు మొత్తుకుంటున్నా… త్రిష మాత్రం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూనే ఉంది.
తనకున్న పరిచయాలతో త్రిష నేటికీ అరకొర అవకాశాలను అంది పుచ్చుకుంటూనే ఉంది. ఒకపక్క తన జూనియర్ హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కూడా కంటున్నారు. కానీ త్రిష మాత్రం ఇంకా రెమ్యునరేషన్ లెక్కలే చూసుకుంటూ టైం పాస్ చేస్తుంది. పైగా త్రిష సినిమాలు తగ్గాక తనకున్న అభిరుచులను కూడా మార్చుకుంది.
నిజానికి త్రిషకి హారర్ జానర్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. గతంలకో కూడా ఓ సినిమా చేసి.. ఇక అలాంటివి చేయను అని చాలా సార్లు చెప్పింది. ఆ మధ్య ఓ హారర్ సినిమా విషయంలో త్రిషకి ఎదురైన అనుభవాల రీత్యా ఈ మాజీ హీరోయిన్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు అవకాశాలు లేవు కదా. అందుకే.. తన మనసు మార్చుకుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని, హారర్ చిత్రాలు కూడా ఒప్పుకుంటుంది.
ఫేడ్ అవుట్ దశలో ఉన్న హీరోయిన్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. అందుకే.. వచ్చిన ఛాన్స్ లను క్యాష్ చేసుకోవాలని త్రిష ఆరాట పడుతుంది. త్రిష చేతిలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. అందుకే, ఇప్పుడు చిన్నాచితకా చిత్రాల పై పడింది. తాజాగా త్రిష ఒక హారర్ సినిమా ఒప్పుకుంది. విక్రమ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో త్రిష ఈ సినిమా చేయబోతుంది.
ఐతే, హారర్ సినిమాలు మీకు ఇష్టం లేదు కదా ? అంటే.., ‘నటిగా అన్ని రకాల కథలు, పాత్రలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే.. హారర్ జానర్ లో కూడా సినిమాలు చేస్తున్నానని త్రిష చెప్పుకొచ్చింది. మరి త్రిష ఈ సినిమాలతోనైనా మళ్లీ ఫామ్ లోకి వస్తోందేమో చూడాలి.