https://oktelugu.com/

OTT: ఓటీటీలోకి మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఎప్పుడు వస్తుందంటే?

OTT: సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. ఓటీటీలో కొన్ని అద్భతమైన సినిమాలు వస్తుండడంతో వీటిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 28, 2024 / 10:25 AM IST

    Agnisakshi web series

    Follow us on

    OTT: ఓటీటీ ప్లాట్ ఫాం పై ఇటీవల సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల యక్షిని అనే మూవీ ప్రేక్షకుల ఆదరన పొందింది. ఇందులో మంచులక్ష్మి, వేదికలు నటించారు. సాధారణ సినిమాల కంటే సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ సినిమాలకు రేటింగ్ ఎక్కువగా వస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది డైరెక్టర్లు ప్రత్యేకంగా ఇలాంటి వాటిపైనే ఫోకస్ పెడుతున్నారు. లేటేస్టుగా మరో మూవీ రాబోతుంది. ఆ సినిమా విశేషాల్లోకి వెళ్దాం..

    సినిమా థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. ఓటీటీలో కొన్ని అద్భతమైన సినిమాలు వస్తుండడంతో వీటిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు సైతం ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేయడానికి సినిమాలు తీస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు సైతం ఓటీటీలో రిలీజ్ చేసే వెబ్ సిరీసుల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిభ ఉన్న డైరెక్టర్లు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీస్తున్నారు.

    లేటేస్టుగా తెలుగు వెబ్ సిరీస్ ‘అగ్నిసాక్షి’ రాబోతుంది. అంబటి అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమలో ఐశ్వర్య మెయిన్ క్యారెక్టర్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి చాలా రోజుల ముందే అనౌన్స్ చేశారు. ఇటీవల క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు. దీనిని డిస్నీ హాట్ స్టార్ లో జూలై 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అంబటి అర్జున్, ఐశ్వర్యలు కలిసి పలు సీరియళ్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి జోడి ఆకట్టుకుంటుంది.

    ఇందులో భాగంగా వీరిద్దరు కలిసి కొత్తగా మూవీ తీశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన డైరెక్టర్, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలు వెల్లడించలేదు. కానీ ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగూ ఉంటుది. ఈ పోలీస్ ఆఫీసర్ కు ఓ అమ్మాయి తోడవుతుంది. వీరిద్దరి లైఫ్ లోకి ఓ కేసు వస్తుంది. దీనిని ఎలా పరిష్కరించారన్నేది కథాంశం. ట్విస్ట్, సస్పెన్స్ లతో ఈ సినిమా ఆకట్టుకోనుంది.