Homeఎంటర్టైన్మెంట్Pelli Kani Prasad Trailer : పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ రివ్యూ: పెళ్లి కోసం...

Pelli Kani Prasad Trailer : పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ రివ్యూ: పెళ్లి కోసం తపించే యువకుడి వ్యధ, సప్తగిరికి బ్రేక్ వచ్చేనా?

Pelli Kani Prasad Trailer : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ప్రేమ కథా  చిత్రం, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాలతో సప్తగిరి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అనంతరం హీరోగా కూడా ప్రయత్నం చేశాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి, వజ్ర కవచదర గోవింద చిత్రాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. అయితే ఆయన సక్సెస్ కాలేదు. ఈ చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరలా కమెడియన్ గా బిజీ అయ్యాడు. కాగా మరోసారి ఆయన హీరోగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. పెళ్లికాని ప్రసాద్ టైటిల్ తో కామెడీ ఎంటర్టైనర్ చేశాడు.
పెళ్లి కాని ప్రసాద్ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకుడు. కే వై బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్క వెంకటేశ్వర గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించారు. సప్తగిరికి జంటగా ప్రియాంక శర్మ నటిస్తుంది. మురళీ ధర్ గౌడ్, అన్నపూర్ణ కీలక రోల్స్ చేస్తున్నారు. పెళ్లి కాని ప్రసాద్ మూవీ మార్చ్ 21న థియేటర్స్ లోకి రానుంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా నిడివి కలిగిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కామెడీ పంచెస్ బాగున్నాయి.
ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ ని కథగా ఎంచుకున్నారు. ఉద్యోగం, ఆస్తి ఉన్నా అబ్బాయిలకు పెళ్లి కావడం కష్టంగా ఉంది. అలాంటి సమయంలో హీరో తండ్రి కట్నం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఏజ్ బార్ అవుతున్న హీరో తండ్రి తీరుకు అగచాట్లు పడుతుంటాడు. కథ ఏమిటో ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేసింది. పెళ్లి కోసం తల్లడిల్లే  హీరో ప్రసాద్ పెళ్లి కష్టాలను ఎంత ఫన్నీగా చూపించారు అనేది కథ. ట్రైలర్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఆ మధ్య అల్లరి నరేష్ ఇదే తరహా కథతో ఆ ఒక్కటీ అడక్కు మూవీ చేశాడు. ఆ చిత్రంలో మ్యాట్రీమోని మోసాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. పెళ్లి కాని ప్రసాద్ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. మాటలు అఖిల్ వర్మ సమకూర్చారు.
https://www.youtube.com/watch?v=Uek3nUhNIJM&ab_channel=DilRaju
RELATED ARTICLES

Most Popular