https://oktelugu.com/

Agent Collections : ‘ఏజెంట్’ మొదటివారం వసూళ్లు..మంచు విష్ణు ‘జిన్నా’ కంటే తక్కువ వసూళ్లు!

ఈ సినిమా విడుదలై ఇప్పటికీ వారం రోజులు పూర్తి అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ మొత్తం రెంటల్ బేసిస్ మీద కాకుండా, కమిషన్ బేసిస్ మీద నడుస్తుంది.అయినా కానీ 5 వ రోజు నుండి షేర్స్ రావడం లేదు

Written By:
  • NARESH
  • , Updated On : May 4, 2023 / 10:06 PM IST
    Follow us on

    Agent Collections : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఏడాది విడుదలైన సినిమాలన్నిట్లో ఇది భారీ డిజాస్టర్ అని చెప్పొచ్చు. మొదటి రోజు మొదటి ఆట నుండే అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చిన ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా కూడా ట్రేడ్ ని బాగా నిరాశపరిచింది.పది కోట్ల రూపాయలకు పైగా షేర్ ని కేవలం మొదటి రోజు రాబట్టాల్సిన ఈ చిత్రం, కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    ఇక రెండవ రోజు నుండి ఈ చిత్రానికి షేర్స్ రావడమే గగనం అయిపోయింది.అంత దారుణంగా వసూళ్లు పడిపోయాయి, ముఖ్యంగా రెంటల్ బేసిస్ మీద నడిచే థియేటర్స్ పరిస్థితి అయితే రెండవ రోజు నుండి దయనీయంగా తయారైంది.నిర్మాతలు సైతం సినిమా విడుదలైన మూడు రోజులకే డిజాస్టర్ ఫ్లాప్ అని ట్విట్టర్ లో చెప్పుకొచ్చారు.

    అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికీ వారం రోజులు పూర్తి అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ మొత్తం రెంటల్ బేసిస్ మీద కాకుండా, కమిషన్ బేసిస్ మీద నడుస్తుంది.అయినా కానీ 5 వ రోజు నుండి షేర్స్ రావడం లేదు, కొన్ని థియేటర్స్ అగ్రిమెంట్ కారణంగా ఇంకా కొన్ని రోజులు నడుపుకోవాల్సి వస్తుంది కానీ, 90 శాతం ఏజెంట్ థియేటర్స్ రేపు విడుదల అవుతున్న ‘ఉగ్రం’, ‘రామబాణం’ మరియు ‘గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ’ చిత్రాలకు వెళ్లనున్నాయి.

    ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 37 కోట్ల రూపాయలకు జరిగింది, దాంతో నష్టం 30 కోట్ల రూపాయిలు వాటిల్లింది.మరో విశేషం ఏమిటంటే నైజాం వంటి ప్రాంతాలలో ‘ఏజెంట్’ చిత్రం కంటే మంచు విష్ణు ‘జిన్నా’ చిత్రానికి ఎక్కువ వసూళ్లు రావడం విశేషం.అక్కినేని ఫ్యామిలీ కి ఇంతకంటే అవమానం మరొకటి ఉండదేమో, రాబొయ్యే రోజుల్లో అఖిల్ బలమైన హిట్ కొట్టాలని ఆశిద్దాం.