Pawan Kalyan Next Film: ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిన్నటి తో అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్లాన్ చేసిన ఒక సాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, త్వరలోనే మూవీ కి సంబంధించిన చివరి షెడ్యూల్ ని పూర్తి చేయనున్నాడు. దీంతో మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఈ సినిమా తర్వాత సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తానని పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలకు అభిమానులు నిరాశకు గురయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత సినిమాలు చేయడం ఆపేస్తున్నాడా?, ఇది చాలా తప్పుడు నిర్ణయం అంటూ సోషల్ మీడియా లో ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: ‘కూలీ’ లో పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ సన్నివేశం..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలను మానేస్తానని ఈ ఇంటర్వ్యూస్ లో చెప్పని విషయాన్ని అభిమానులు గుర్తించలేదు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే త్వరలోనే ఆయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయనున్నాడు. గతంలో ఈ సంస్థ ‘బ్రో’ చిత్రాన్ని నిర్మించింది. ఆ చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వకపోయిన కూడా ఒక ఫీల్ గుడ్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఉంది అనే సంతృప్తిని అభిమానులకు అందించింది ఈ చిత్రం. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో తెరకెక్కబోయే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల క్రితమే ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక పవర్ ఫుల్ కమర్షియల్ స్టోరీ ని చెప్పాడట.
Also Read: ‘కూలీ’ లో నాగార్జున క్యారక్టర్ ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?
అందుకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు. ఒక రెండేళ్ల పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలనపైనే ద్రుష్టి పెడుతాడట. తాను అనుకున్న కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఫిక్స్ అయ్యిందంటే , ‘హరి హర వీరమల్లు’ నిర్మాత AM రత్నం అప్పుల ఊబిలో కూరుకొనిపోయి సినిమాని రిలీజ్ చేయడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఆయన పడుతున్న ఆ ఇబ్బందులను చూడలేక, పవన్ కళ్యాణ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా 70 కోట్ల రూపాయిలు తీసుకొని నిర్మాత AM రత్నం అప్పులను కట్టి సినిమాని విడుదల చేయించాడు. తీసుకున్న ఆ 70 కోట్ల రూపాయలకు బదులుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో ఒక సినిమా చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.