Prabhas next film after Spirit: పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ఇప్పటివరకు చేయని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక రీసెంట్ గా మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్నారు… వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేయాలని సందీప్ చూస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన మరో సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు. ఇక ఇదే క్రమంలో ప్రభాస్ సైతం స్పిరిట్ సినిమా పూర్తి అయిన తర్వాత నటిస్తాడా? ‘కల్కి 2’ సినిమాని చేస్తాడా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ‘కల్కి 2’ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి..ఎందుకంటే నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశాడట. కేవలం ప్రభాస్ వచ్చి నటిస్తే సినిమా స్టార్ట్ అవుతోంది.
అందుకోసమే ఈ సినిమా తర్వాత కల్కి సినిమా చేసి అప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్ 2’ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది… ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. మరి ఆ సినిమాలన్నింటిని పూర్తి చేయాలంటే దాదాపు నాలుగు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…
2026 సంక్రాంతి కానుకగా ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తే ప్రభాస్ లోని మరో యాంగిల్ బయటకు వస్తోంది. ఆయన హార్రర్ థ్రిల్లర్ సినిమాలను చేయలేదు. రాజసాబ్ సినిమా అతనికి కొత్త గుర్తింపు ఇస్తుందని తన అభిమానులు సైతం భావిస్తున్నారు…
కానీ ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక నెల రోజులపాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా 2026 చివరి కల్లా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది…