Akhanda: బాలకృష్ణ అఖండ మూవీ ఇవాళ్టితో 50 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాడు బాలయ్య. కాగా బాలయ్య మాట్లాడుతూ.. ‘సమరసింహారెడ్డి తర్వాత మళ్లీ సుదర్శన్ థియేటర్ కు వచ్చా. అఖండ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు. ఏ సినిమా అయినా థియేటర్‌కు వెళ్లి చూస్తేనే మజాగా ఉంటుంది. ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో అఖండ చూస్తే అర్థం అవుతుంది’ అని బాలయ్య చెప్పుకొచ్చాడు.
పనిలో పనిగా అభిమానులకు కృతజ్ఞతలు కూడా బాలకృష్ణ తెలిపాడు. నిజానికి ఈ రోజుల్లో 4 వారాలకే థియేటర్లో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అలాంటిది అఖండ 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమవ్వడం విశేషమే. ఈ క్రమంలో ‘అఖండ’ ఘన విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ అభిమానులు వేడుకలు చేస్తున్నారు. నటసింహం బాలయ్య అఖండ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి.. బాలయ్య కెరీర్‌లో మొదటి 200 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా కూడా ఇదే అని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: అదిరిపోయే పీపీఎఫ్ ప్లాన్.. రూ.12,500 డిపాజిట్‌తో కోటి రూపాయలు!
పైగా బాలయ్య ‘అఖండ’ సినిమా మరో రికార్డు సాధించింది. థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఒకవిధంగా ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఆడిన సినిమా అఖండ ఒక్కటే కావడం విశేషం. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ లో ఊపు కనిపించలేదు. అయితే, బాలయ్య అఖండతో ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఏది అయితే ఏం.. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బోణీ పడింది. బాలయ్యకు గొప్ప హిట్ అందింది.
Also Read: లిల్లీ ఫ్లవర్ సాగుతో లక్షల్లో సంపాదించే అవకాశం.. ఎలా అంటే?