Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. దాదాపు 40 సంవత్సరాల నుంచి తను ఒక్కడే ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు అంటే ఆయన ప్రతిభ గాని, ఆయనకున్న డెడికేషన్ గానీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి జనరేషన్ తో కూడా పోటీ పడుతూ ఆయన సినిమాలు చేస్తున్నాడు అంటే వర్క్ పట్ల ఆయనకున్న డెడికేషన్ ఎలాంటిదో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి.
ఇక ఒకప్పుడు చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు పొందిన వారు చాలామంది ఉన్నప్పటికీ 2000 సంవత్సరం తర్వాత నుంచి ఆయన పక్కన హీరోయిన్ గా నటించి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్, సమీరా రెడ్డి లాంటి హీరోయిన్లు ఉండడం విశేషం… నిజానికి చిరంజీవి పక్కన ఒక్క సినిమాలో అవకాశం వస్తే నటించడానికి రెడీ గా చాలా మంది నటీనటులు ఉన్నారు. ఇక హీరోయిన్లు అయితే చిరంజీవి పక్కన ఏదైనా చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
అలాంటి ఒక దిగ్గజ నటుడితో నటిస్తే నటనకు సంబంధించిన మెలకువలు నేర్చుకోవడమే కాకుండా ప్రేక్షకులందరి దృష్టిలో పడొచ్చు అనే ఉద్దేశంతోనే ఆయనతో చేయడానికి చాలా మంది ఒప్పుకుంటారు. ఇక హీరోయిన్ గా నటించాల్సి వస్తే మాత్రం వల్ల అదృష్టమనే చెప్పాలి. మెస్మరైజ్ చేసే నటనతో చిరంజీవి అందరిని మెప్పించడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో మరొక సినిమాకి కమిటీ అయ్యాడు. అలాగే హరిష్ శంకర్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా రాబోతున్నట్టుగా రీసెంట్ గా వార్తలైతే వస్తున్నాయి. ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచి వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు…