Sivaji: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ శివాజీ హౌస్ లో అడుగుపెట్టినప్పుడు అసలు ఆయన ఏం ఆడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఆట తీరు ప్రదర్శించాడు.తన ప్రవర్తన మాట తీరు తో ఆడియన్స్ బాగా మెప్పించారు శివాజీ. బిగ్ బాస్ హౌస్ లో ఒక పెద్ద మనిషిగా అందరిని శాసిస్తున్నారు. ఆఖరికి బిగ్ బాస్ కూడా శివాజీ కి తలవంచుతున్నాడు. శివాజీ లేకపోతే బిగ్ బాస్ ఆటే లేదు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. హోస్ట్ నాగార్జున కూడా మిగతా కంటెస్టెంట్స్ ని వాయించేస్తున్నాడు కానీ శివాజీ ఏమి అనలేక పోతున్నాడు.ఆ విధంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు శివాజీ.
అయితే శివాజీ బిగ్ బాస్ కి వెళ్లడం వెనుక పెద్ద ప్లానే ఉంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత శివాజీ ‘నరసారావు పేట ‘నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ నియోజకవర్గం ఎందుకంటే .. అది అతని సొంత నియోజకవర్గం కాబట్టి. వచ్చే ఎన్నికల్లో శివాజీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆయన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. నిజానికి గత ఎన్నికల్లోనే శివాజీ పోటీ చేయాల్సి ఉండగా .. సీట్ల పంపకం లో కుదర్లేదు.
అయితే నరసారావు పేట లో అధికార వైసీపీ చాలా బలంగా వుంది. ఆ పార్టీ తరపున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. 32 రెండు వేల భారీ మెజారిటీతో తన ప్రత్యర్థి అరవింద బాబు చదలవాడ పై గెలుపొందారు. ఇప్పుడు చదలవాడ ని కాదని శివాజీకి సీటు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణం లో శివాజీకి అసలు టికెట్ రావడంపై అనుమానాలు చాలానే ఉన్నాయి. కానీ బిగ్ బాస్ కి వెళ్లక ముందు శివాజీ మాత్రం ఎన్నికల పై ఆసక్తి లేదనే చెప్పారు. పదవులపై తనకు ఆరాటం లేదని చెప్పారు.
ముఖ్యంగా నా దగ్గర డబ్బులు లేవు. జనం ఓట్లు అమ్ముకుంటున్నారు. జనం కంటే ముందు క్యాడర్ కి డబ్బులివ్వాలి. కాబట్టి నా పరిధి నాకు తెలుసు.. నేను తాగే నీళ్ల మీద ఒట్టేసి చెబుతున్నా .. నాకు రాజకీయాలు వద్దు అని శివాజీ చెప్పాడు. పదవులు కావాలి పోటీ చెయ్యాలి అని లేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ తో నిర్ణయం మార్చుకునే అవకాశం ఉందేమో చూడాలి మరి.