Rahul Sipligunj- Rathika Rose: రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్… రతికా రోజ్ ఓల్డ్ వీడియో వైరల్!

ఎక్స్ లవర్ గుర్తొచ్చి కన్నీరు పెట్టుకోగా... బయట ఉన్న ఆమె టీం రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వదిలారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక అని రాహుల్ కి అర్థమైంది.

Written By: Shiva, Updated On : September 27, 2023 9:46 am

Rahul Sipligunj- Rathika Rose

Follow us on

Rahul Sipligunj- Rathika Rose: ఎలాగైనా టైటిల్ కొట్టాలని పక్కా వ్యూహాలతో హౌస్లో అడుగుపెట్టింది రతికా రోజ్. అందుకు అవసరమైనవన్నీ చేస్తుంది. అబ్బాయిలను కవ్వించడం, పొట్టి డ్రెస్సుల్లో స్కిన్ షో చేయడం చేస్తుంది. ఇక హౌస్లో విషయం ఏదైనా తనే హైలెట్ అయ్యేలా ట్రై చేస్తుంది. లేని కంటెంట్ క్రియేట్ చేస్తుంది. రతికా రోజ్ చాలా ఖిలాడీ అని ఇప్పటికీ ఆడియన్స్ కి అర్థమైపోయింది. అమ్మడు భారీగా పీఆర్ టీమ్స్ ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. తన ఎక్స్ లవర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు బయటకు తీసి లబ్ది పొందాలని చూస్తుంది.

ఎక్స్ లవర్ గుర్తొచ్చి కన్నీరు పెట్టుకోగా… బయట ఉన్న ఆమె టీం రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వదిలారు. ఇదంతా ముందస్తు ప్రణాళిక అని రాహుల్ కి అర్థమైంది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఏకి పారేశారు. ఎప్పుడో ఆరేళ్ళ నాటి ప్రైవేట్ ఫోటోలు ఇప్పుడు బయటకు ఎలా వచ్చాయని రాహుల్ ప్రశ్నించాడు. తమ టాలెంట్ ని నమ్ముకోకుండా ఇతరుల మీద ఆధారపడుతుందని ఇండైరెక్ట్ గా ఆమెపై ఆరోపణలు చేశాడు.

రతికా ఎలాంటి అమ్మాయి అయినా స్పైసీ కంటెంట్ ఇచ్చే వాళ్ళకే డిమాండ్ ఉంటుంది. అందుకే నిర్వాహకులు ఓటింగ్ లో వెనుకబడ్డా అలాంటి వాళ్ళను వదులుకోవడానికి ఇష్టపడరు. కాగా రతికా రోజ్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అది పటాస్ షోకి సంబంధించిన వీడియో. యాంకర్ రవి, శ్రీముఖిల సారధ్యంలో పటాస్ షో నడిచిన విషయం తెలిసిందే. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో పటాస్ షో చేశారు.

ఈ షోలో బాయ్ ఫ్రెండ్స్ గురించి ఆమె క్రేజీ కామెంట్స్ చేసింది. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే లేడని ఎగతాళి చేస్తారు. ఉంటేనేమో ఆమె అల చేస్తుంది, ఇలా చేస్తుందని తప్పుబడతారు… అని రతికా రోజ్ అన్నది. దానికి యాంకర్ రవి, నీకు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడుతున్నావా? అని కౌంటర్ వేశాడు. అప్పట్లో రతికా ఇలా ఉండేది అంటూ ఆ వీడియో వైరల్ చేస్తున్నారు. ఇక రతికా జోరు చూస్తుంటే కొన్ని వారాలు హౌస్లో కచ్చితంగా ఉందనిపిస్తుంది.