https://oktelugu.com/

Nagarjuna-Tabu: హీరోయిన్ టబుతో ఎఫైర్? క్లారిటీ ఇచ్చిన నాగార్జున!

Nagarjuna-Tabu: హీరో హీరోయిన్స్ మధ్య అఫైర్స్ సర్వసాధారణం. సినిమా కోసం ఉత్తుత్తి రొమాన్స్ చేసే క్రమంలో కొందరు నిజంగానే ప్రేమలో పడిపోతారు. ఈ ప్రేమకథల్లో చాలా వరకు మధ్యలోనే వీగిపోతాయి. వందలో ఒకటో రెండో పెళ్లి వరకు వెళతాయి. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మొదటి భార్యతో విడాకుల తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించారు. ఇంట్లో ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నారు. కాగా నాగార్జున హీరోయిన్ టబుతో ఎఫైర్ పెట్టుకున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. నిన్నే పెళ్లాడా […]

Written By:
  • Shiva
  • , Updated On : August 29, 2022 / 03:42 PM IST
    Follow us on

    Nagarjuna-Tabu: హీరో హీరోయిన్స్ మధ్య అఫైర్స్ సర్వసాధారణం. సినిమా కోసం ఉత్తుత్తి రొమాన్స్ చేసే క్రమంలో కొందరు నిజంగానే ప్రేమలో పడిపోతారు. ఈ ప్రేమకథల్లో చాలా వరకు మధ్యలోనే వీగిపోతాయి. వందలో ఒకటో రెండో పెళ్లి వరకు వెళతాయి. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మొదటి భార్యతో విడాకుల తర్వాత హీరోయిన్ అమలను ప్రేమించారు. ఇంట్లో ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నారు. కాగా నాగార్జున హీరోయిన్ టబుతో ఎఫైర్ పెట్టుకున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.

    Nagarjuna-Tabu

    నిన్నే పెళ్లాడా మూవీలో మొదటిసారి టబు, నాగార్జున కలిసి నటించారు. అనంతరం ఆవిడా మా ఆవిడే చిత్రం చేశారు. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న టబు మాత్రం వివాహం చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం లవ్ అఫైర్స్ అనే వాదన ఉంది. ముఖ్యంగా నాగార్జున కారణంగానే టబు సింగిల్ గా ఉండిపోయారని కొందరు అంటారు. ఇప్పటికి కూడా టబు హైదరాబాద్ వస్తే నాగార్జునను కలిసి వెళ్లాల్సిందే. అయితే నిజంగా నాగార్జున-టబు మధ్య ఉన్న ఆ బంధం ఏమిటనే సందేహం మాత్రం మెదళ్లను తొలుస్తూనే ఉంది.

    కాగా గతంలో నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చారు. టబుతో రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. రెండు దశాబ్దాలుగా పైగా టబుతో నాకు అనుబంధం ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులం. నా భార్య అమలకు కూడా టబు ఫ్రెండ్. ఇంటికి వస్తే బాగా మాట్లాడుకుంటాము, అని నాగార్జున తెలియజేశారు. టబుతో నాకు ఎఫైర్ లేదని నాగార్జున కుండబద్దలు కొట్టారు. తాజా ఇంటర్వ్యూలో కూడా నాగార్జున ఇదే చెప్పినట్లు సమాచారం.

    Nagarjuna

    ఇద్దరు అబ్బాయిల మధ్య లాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్లే అమ్మాయి అబ్బాయి మధ్య కూడా సుదీర్ఘ స్నేహం ఉండటంలో తప్పులేదు. నాగార్జున, టబు లది కూడా అలాంటి లాంగ్ రిలేషన్షిప్ అన్నమాట. పరిశ్రమలో నాగార్జునకు మన్మధుడు ఇమేజ్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయి. అందులోనూ ఒకటి రెండు చిత్రాలు కలిసి నటించేసరికి జనాలు అపార్థం చేసుకున్నారు. అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ తో టబు స్ట్రాంగ్ రిలేషన్ నడిపినట్లు సమాచారం. అజయ్ దేవ్ గణ్ తో టబు చాలా కాలం సన్నిహితంగా ఉన్నారట. ఈ అఫైర్ వార్తల్లో నిజం ఉన్నప్పటికీ లేనప్పటికీ అవి వాళ్ళ వ్యక్తిగత విషయాలని వదిలేయడం మంచిది.

    Tags