https://oktelugu.com/

Comedian Ali Daughter: పెళ్లిపీటలెక్కనున్న కమెడియన్‌ అలీ కూతురు.. అసలు వరుడు ఎవరో తెలుసా?

Comedian Ali Daughter: ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ అంటే తెలియనివారు లేరు. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసి హీరోగా మారిన విషయం తెలిసిందే. దాదాపు 1150 సినిమాల్లో నటించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. కామెడీ చేయడంలో ప్రత్యేకత చూపిస్తూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. సినిమాల్లో కామెడీ ప్రధానంగా చేసుకుని తన టాలెంట్ తో ఎదిగిన ఆలీకి ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అటు వెండితెర, […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2022 / 03:36 PM IST
    Follow us on

    Comedian Ali Daughter: ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ అంటే తెలియనివారు లేరు. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసి హీరోగా మారిన విషయం తెలిసిందే. దాదాపు 1150 సినిమాల్లో నటించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. కామెడీ చేయడంలో ప్రత్యేకత చూపిస్తూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు. సినిమాల్లో నటనలో వైవిధ్యం చూపిస్తున్నాడు. సినిమాల్లో కామెడీ ప్రధానంగా చేసుకుని తన టాలెంట్ తో ఎదిగిన ఆలీకి ఎన్నో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అటు వెండితెర, ఇటు బుల్లితెరలో కూడా రాణిస్తున్నాడు. ఈటీవీలో ‘అలీతో సరదాగా’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.

    Comedian Ali

    అలీ భార్య జుబేదా సామాజిక మాధ్యమాల్లో చురుకుగానే ఉంటోంది. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. వారితో టచ్ లో ఉంటుంది. తన అభిప్రాయాలు వారితో పంచుకుంటోంది. అంతేకాదు సొంతంగా యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. తన వ్యక్తిగత విషయాలను కూడా అందులో అందరితో షేర్ చేస్తుంది. తన కుటుంబ విషయాలను కూడా ప్రస్తావిస్తుంది. ప్రస్తుతం తన కూతురు నిశ్చితార్థాన్ని కూడా ఇందులో పెట్టింది. దీనికి సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హాజరయ్యారు.

    Comedian Ali Daughter Engagement

    ఇంతకీ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా? అతడు ఏం చేస్తాడు? అనే ప్రశ్నలు అందరికి రావడం సహజమే. దీనిపై అలీ కూడా క్లారిటీ ఇస్తున్నాడు. తనకు కాబోయే అల్లుడు ‘డాక్టర్’ అని చెబుతున్నాడు. అలీ కుటుంబంలో అందరు కూడా వైద్య రంగాన్నే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.అలీ కూతురు కూడా ఓ డాక్టర్. దీంతో డాక్టర్ సంబంధమే తీసుకొచ్చారు. వియ్యంకుల ఇంట్లో వారు కూడా అందరూ వైద్యులేనట. దీంతో డాక్టర్ల సంబంధంతోనే అలీ కూతురుకు పెళ్లి కుదిర్చారు. ఇటు అలీ కుటుంబం అటు వియ్యంకుల కుటుంబంలో అందరూ వైద్యులు కావడంతో ఇక వారికి ఏ ఢోకా లేనట్లు తెలుస్తోంది.

    అలీ కుమార్తె ఫాతిమా కూడా మెడిసిన్ పూర్తి చేసింది. అలీ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ కావడంతో ఇక అందరు అటు వైపు వెళ్లారు. అలీ కూతురు నిశ్చితార్థం ఘనంగా నిర్వహించి యూ ట్యూబ్ చానల్, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయ్యింది.. అందరు వీక్షించి బాగుందని కామెంట్లు పెడుతున్నారు.

    Tags