Pawan Magic : ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 12 న విడుదల అవ్వడానికి సిద్దమై అనేక ఓవర్సీస్ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా వాయిదా పడిన వార్త రావడం అభిమానులను ఎంతటి నిరాశకు గురి చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా రెండు లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 1 మిలియన్ గ్రాస్ ప్రీ సేల్స్ వైపు దూసుకెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వాయిదా పడడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ని క్లోజ్ చేసి బుకింగ్స్ చేసుకున్న వాళ్లకు డబ్బులు తిరిగి వెనక్కి పంపేశారు. లండన్ లో కూడా ఇదే పరిస్థితి. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కాబోతుంది?, గతంలో ఇలాగే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సినిమాలు కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయా?, పడిన తర్వాత వాటి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) హీరోలు గా నటించిన #RRR చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన విడుదల చేద్దామని అనుకున్నారు. ఆ మేరకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రొమోషన్స్ మొదలు పెట్టారు. ఓవర్సీస్ లో అన్ని దేశాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. నార్త్ అమెరికా లో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన వారం లోపే 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన డబ్బులు మొత్తాన్ని మళ్ళీ తిరిగి వినియోగదారులకు పంపేశారు. కానీ మళ్ళీ ఈ చిత్రం మార్చ్ నెలలో విడుదలై ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్స్ నుండే ఈ చిత్రానికి 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
సరిగ్గా ఇలాగే ప్రభాస్(Rebel Star Prabhas) ‘సలార్'(Salar Movie) చిత్రం కూడా 2023 సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. ఈ చిత్రంపై అప్పట్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ని నార్త్ అమెరికా లో ప్రారంభించారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రీ సేల్స్ నాలుగు లక్షల డాలర్లకు పైగా వచ్చాయి. కానీ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలనే ఉద్దేశ్యం తో డిసెంబర్ నెలకు వాయిదా వేశారు. అలా వాయిదా వేసినప్పటికీ ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఈ రెండు సినిమాలకు జరిగినట్టుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా జరిగింది. మరి ఈ సినిమా కూడా సమె మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.
Also Read : పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసిన సినిమాలు ఇవేనా..?