Bro Movie Advance Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో 13 రోజుల్లో మన ముందుకి రాబోతుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా ప్రారంభించారు దర్శక నిర్మాతలు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి విజయ యాత్ర’ లో బిజీ గా ఉండడం వల్ల, ఈ చిత్రం లో మరో హీరోగా నటించిన సాయి ధరమ్ తేజ్ ప్రొమోషన్స్ బాధ్యతలు మొత్తం తీసుకున్నాడు.
నేడు తిరుపతి లో రెండవ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి హాజరు కాబోతున్నాడు. ఈ ఈవెంట్ తర్వాత ఆయన నుండి వరుసగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి. డైరెక్టర్ సముద్ర ఖని , మరియు హీరోయిన్స్ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారీయర్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ నెల 22 వ తారీఖున హైదరాబాద్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చెయ్యబోతున్నారు.
ఇకపోతే ఏ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే అమెరికా లో డల్లాస్ ప్రాంతం లో ప్రారంభం అయ్యాయి. సినీ మార్క్ లొకేషన్ లో మూడు షోస్ ని యాడ్ చేసారు, ఈ షోస్ ని యాడ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే 90 శాతం టికెట్స్ అమ్ముడుపోయాయి, అందువల్ల 50 వేల డాలర్స్ వచ్చాయి.
ఇది గొప్ప ప్రారంభం అనే చెప్పాలి. ఇంకా ప్రైమ్ టైం లో మంచి స్క్రీన్స్ లో షోస్ యాడ్ చేస్తూ పోతే ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి 1 మిలియన్ డాలర్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే పవర్ స్టార్ ని ఓవర్సీస్ కింగ్ అని మరోసారి ముక్తకంఠం తో అభిమానులు అనొచ్చు. ఎందుకంటే మిగిలిన సినిమాలకు లాగ కాకుండా బ్రో చిత్రానికి జరిగిన ప్రొమోషన్స్ చాలా తక్కువ. అంత తక్కువ ప్రొమోషన్స్ తో ఈ రేంజ్ గ్రాస్ నంబర్స్ పెడితే ఎవరైనా ఓవర్సీస్ కింగ్ అని ఒప్పుకోవాల్సిందే. చూడాలి మరి.