Chennakesava Reddy Special Shows: ఇటీవల కాలం లో స్పెషల్ షోస్ ట్రెండ్ బాగా ఊపందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ప్లాన్ చేసిన పోకిరి సినిమా స్పెషల్ షోస్ తో ప్రారంబైన ఈ స్పెషల్ షోస్ ట్రెండ్..పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు వేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ తో తారాస్థాయికి చేరుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..పోకిరి సినిమా స్పెషల్ షోస్ కి కోటి 73 లక్షల గ్రాస్ వసూళ్లు రాగా..జల్సా సినిమా స్పెషల్ షోస్ కి మూడు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం ఆల్ ఇండియన్ రికార్డు గా చెప్పుకోవచ్చు..ఈ రెండు సినిమాల మధ్యలో వచ్చిన ఒక్కడు మరియు తమ్ముడు సినిమాలకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ స్పెషల్ షోస్ ట్రెండ్ ఎదో బాగుందే..కొత్త సినిమాలకంటే వీటికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని గ్రహించిన ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ హీరోల కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలను మల్లి గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యడానికి ముందుకి వస్తున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చెన్నకేశవ రెడ్డి సినిమా స్పెషల్ షోస్ ని ప్రపాంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా విడుదల చేస్తున్నారు..ఎందుకంటే సెప్టెంబర్ 25 వ తారీకు వరుకు ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది అన్నమాట..ఆ సందర్భంగా ఈ సినిమాకి స్పెషల్ షోస్ ని ప్లాన్ చేసారు నందమూరి అభిమానులు..ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..అది కూడా మాములు రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ కాదు..పోకిరి మరియు జల్సా సినిమాల స్పెషల్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టే రేంజ్ లో జరిగాయి.

కానీ ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ లో మాత్రం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి..పరిస్థితి చూస్తూ ఉంటె ఈ సినిమాకి కనీస స్థాయి వసూళ్లు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు..ఓవర్సీస్ లో ఆ స్థాయి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇలా చతికిల పడింది అంటూ నందమూరి అభిమానులు తలలు పట్టుకున్నారు..అయితే శనివారం మరియు ఆదివారం నాడు ఈ స్పెషల్ షోస్ ని ప్లాన్ చేసారు కాబట్టి షో సమయానికి హౌస్ ఫుల్ పడే అవకాశం ఉందని చెప్తున్నారు విశ్లేషకులు..చూడాలి మరి ఈ సినిమా స్పెషల్ షోస్ ఎంత గ్రాస్ వసూళ్లను సాధిస్తుంది అనేది.