Jalsa Re-Release Advance bookings: ఈ ఏడాది న్యూ ఇయర్ కి కుర్రాళ్ళు థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేసే విధంగా ‘జల్సా'(#Jalsa4k) చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాని కేవలం పవన్ కళ్యాణ్ అభుమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఇష్టపడుతారు. జెన్ జీ ఆడియన్స్ లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. అయితే 2022 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. రెస్పాన్స్ మెమోలు రేంజ్ లో రాలేదు.
స్పెషల్ షోస్ ద్వారా దాదాపుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఆల్ టైం ఇండియన్ రికార్డు ని నెలకొల్పింది. ఇప్పుడు అదే చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా రెండవ సారి విడుదల చేయబోతున్నారు. ఒకసారి విడుదల చేశారు కదా, రెండవ సారి కూడా రీ రిలీజ్ చేస్తే ఎవరు చూస్తారు?, ఈసారి వర్క్ అవ్వదు అని బలంగా నమ్మరు ట్రేడ్ విశ్లేషకులు. కానీ వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేసింది ఈ చిత్రం. రీసెంట్ గానే విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. విజయవాడ లో G3 మరియు శైలజ థియేటర్స్ లో 8 గంటల ఆటకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. అవి హౌస్ ఫుల్స్ అవ్వడం తో ఇప్పుడు కొత్త షోస్ ని జత చేస్తున్నారు.
అదే విధంగా వైజాగ్ లో శ్రీ రామ థియేటర్ లోని అడ్వాన్స్ బుకింగ్స్ స్టేటస్ ఫాస్ట్ ఫిల్లింగ్ లోకి రాగా, శ్రీ మెలోడీ, కిన్నెర థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్ లోనే బుకింగ్స్. ఇవి కూడా హౌస్ ఫుల్ అయ్యేలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు నాలుగు నుండి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. అంటే రెండు రీ రిలీజ్ లు కలుపుకొని 9 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇకపోతే నైజాం ప్రాంతానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ వీకెండ్ లేదా, సోమవారం రోజున మొదలు పెట్టనున్నారు.