https://oktelugu.com/

Adivi Sesh: బాలీవుడ్​లో రెండు సినిమాలకు ఓకే చెప్పిన అడవి శేష్​

Adivi Sesh: టాలీవుడ్​ యంగ్​ హీరో అడవిశేషు వరుస చిత్రాలతో దూసుకెళ్లిపోతున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్​. శేష్​కు నటనతో పాటు, కథ- స్క్రీన్ ప్లే లోనూ మంచి పట్టున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మేజర్ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 12:46 PM IST
    Follow us on

    Adivi Sesh: టాలీవుడ్​ యంగ్​ హీరో అడవిశేషు వరుస చిత్రాలతో దూసుకెళ్లిపోతున్నారు. విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను పలకరిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్​. శేష్​కు నటనతో పాటు, కథ- స్క్రీన్ ప్లే లోనూ మంచి పట్టున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మేజర్ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల చేయనున్నారు.

    Adivi Sesh

    Also Read: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

    ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శోభితా దూళిపాళ్ల, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాను సోనీ పిక్చర్స్ – జీఎంబీ ఎంటర్టైన్మెంట్ – A+S మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినమా పూర్తి కాకుండానే.. మరో రెండు సినిమాలకు సైన్​ చేశారు అడవి శేష్​. అది కూడా బాలీవుడ్​ సినిమాలకు ఒప్పుకున్నట్లు తనే స్వయంగా ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.

    కాగా, మేజర్ సినిమాను.. ముంబయిలో జరిగిన  9/11 దాడిలో  మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చేసిన వీరోచిత పోరాటినికి స్ఫూర్తిగా ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు కంప్లీట్ చేేసుకుని.. ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Also Read: చిరంజీవి మోసం.. చెంప చెల్లుమనిపించిన రాధిక..!