https://oktelugu.com/

Adivi Sesh Supriya Marriage: నాగార్జున మేనకోడలితో అడివి శేష్ మ్యారేజ్…. ముహూర్తం ఫిక్స్?

అడివి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో సుప్రియ ఓ కీలక రోల్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసిందట. డేటింగ్ చేస్తున్న ఈ జనతా పెళ్లి పీటలు ఎక్కనున్నారట. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరిందట. జూన్ 16న అడివి శేష్-సుప్రియల వివాహం జరగనుందట. ఈ పెళ్లి పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

Written By:
  • Shiva
  • , Updated On : June 6, 2023 / 03:42 PM IST

    Adivi Sesh Supriya Marriage

    Follow us on

    Adivi Sesh Supriya Marriage: యంగ్ హీరో అడివి శేష్ ఇంటివాడు కాబోతున్నాడన్న వార్త చక్కర్లు కొడుతుంది. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డను ఆయన వివాహం చేసుకోబోతున్నారట. ఈ అరుదైన వివాహానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. టాలీవుడ్ లో అడివి శేష్-సుప్రియ పెళ్లి వార్త హాట్ టాపిక్ అవుతుంది. హీరో సుమంత్ సోదరి సుప్రియతో అడివి శేష్ రిలేషన్ లో ఉన్నాడనే రూమర్ కొన్నాళ్లుగా వినిపిస్తుంది. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. అక్కినేని కుటుంబ సభ్యుల ప్రైవేట్ పార్టీల్లో అడివి శేష్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    అడివి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రంలో సుప్రియ ఓ కీలక రోల్ చేశారు. ఆ సినిమా షూటింగ్ లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసిందట. డేటింగ్ చేస్తున్న ఈ జనతా పెళ్లి పీటలు ఎక్కనున్నారట. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా కుదిరిందట. జూన్ 16న అడివి శేష్-సుప్రియల వివాహం జరగనుందట. ఈ పెళ్లి పై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

    సుప్రియ కెరీర్ హీరోయిన్ గా మొదలైంది. పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో ఆమె హీరోయిన్ అయ్యారు. తర్వాత హీరోయిన్ గా ఆమె నటించలేదు. చాలా గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తారు. సుప్రియకు గతంలో వివాహం జరిగింది. విబేధాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. రూమర్స్ నిజమైతే ఆమె అడివి శేష్ ని రెండో వివాహం చేసుకోబోతున్నారు.

    ఇక అడివి శేష్ విషయానికి వస్తే కెరీర్ బిగినింగ్ లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశారు. ప్రస్తుతం హీరోగా సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నాడు. ఆయన హీరోగా నటించిన క్షణం, గూఢచారి, ఎవరు?, మేజర్, హిట్ 2 వరుసగా విజయాలు సాధించాయి. ప్రస్తుతం అడివి శేష్ గూఢచారి 2 లో నటిస్తున్నారు. అడివి శేష్ నటి సుప్రియతో వచ్చిన ఎఫైర్ రూమర్స్ ఇంత వరకూ ఖండించకపోవడం విశేషం.