Dacoit Movie Censor Talk: విభిన్నమైన కథలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న అడవి శేష్(Adivi sesh), ‘హిట్ 2’ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చాడు. 2022 వ సంవత్సరం లో విడుదలైన ‘హిట్ : ది సెకండ్ కేస్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత మూడేళ్ళ నుండి ఆయన ‘డెకాయిట్'(Dacoit Movie), ‘గూఢచారి 2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘డెకాయిట్’ చిత్రం రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ నెల 10 వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. చాలా కాలం తర్వాత మన ముందుకొస్తున్న అడవి శేష్ చిత్రం కావడంతో పాటు, ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో యూత్ ఆడియన్స్ లో ఈ చిత్రం పై మంచి బజ్ ఏర్పడింది.
Also Read: 27 కోట్లు పెట్టి కొంటే.. నిండా ముంచాడు.. పాపం ఆయన కష్టం పగవాడికి కూడా రావద్దు
ఇకపోతే నేడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసారని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. చూస్తుంటే మంచి యాక్షన్ చిత్రం లాగా అనిపిస్తోంది, A సర్టిఫికేట్ వస్తుందని భావిస్తే ఈ ట్విస్ట్ ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. ఇక సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మేకర్స్ కి ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ ఆరంభం నుండే ఆసక్తికరమైన లైన్ తో మొదలై, అదిరిపోయే ట్విస్టులతో థ్రిల్లింగ్ అనుభూతి కలిగించే సన్నివేశాలు చాలా బాగున్నాయని, ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ లో వచ్చిందని, ఈమధ్య కాలంలో ఇలాంటి సీక్వెన్స్ చూడలేదని మూవీ టీం ని పొగడ్తలతో ముంచెత్తారట.
లీడింగ్ రోల్స్ చేసిన అడవి శేష్, అనురాగ్ కశ్యప్, మృణాల్ ఠాకూర్ పెర్ఫార్మన్స్ ఇరగకుమ్మేశారని, వాళ్ళ కారణంగా ఈ సినిమా రేంజ్ మారిపోయిందని, ముఖ్యంగా అనురాగ్ కశ్యప్ ని ఈ సినిమాలోకి క్యాస్టింగ్ చేసి చాలా మంచి పని చేసారని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ ఆరంభం లో కాస్త స్లో గా స్క్రీన్ ప్లే నడిచినప్పటికీ, చివరి 45 నిముషాలు మాత్రం గూస్ బంప్స్ రప్పించే రేంజ్ లో ఉందని, ముఖ్యంగా ఈ సినిమాలోని ట్విస్టుల కోసం కచ్చితంగా థియేట్రికల్ అనుభూతి చెందాల్సినవే అని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
